కుర్ర హీరోలు సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రొడక్షన్ అనే సైడ్ ట్రాక్ పై ఫోకస్ పెడుతున్నారు. 'అ!' తో నాని నిర్మాతగా మారాడు. ఈ మధ్య విజయ్ దేవరకొండ కూడా తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమా తీశాడు. లేటెస్ట్ గా మంచు మనోజ్ కూడా ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి 'అహం బ్రహ్మస్మి' సినిమా చేస్తున్నాడు. వీళ్ళే కాదు కార్తికేయ - విశ్వక్ సేన్ లాంటి అప్ కమింగ్ హీరోలకు కూడా సొంత నిర్మాణ సంస్థ ఉంది.
నిజానికి స్టార్ట్ హీరోలు ఈ మధ్య సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - రానా ఇలా అందరికీ సొంత ప్రొడక్షన్ హౌజ్ లున్నాయి. అయితే వీరిని చూసే యంగ్ హీరోలు కూడా నిర్మాత అవతారమెత్తుతున్నారు. అయితే నిర్మాణం గురించి ఏం తెలియకపోయినా బడా నిర్మాత సాయంతో గట్టెక్కెస్తున్నారు.
ఇక హీరోలు నిర్మాత అవతారమెత్తి ఇలా సినిమాలు చేయడం మంచిదే అంటున్నారు బడా నిర్మాతలు. వాళ్ళ వరకూ వస్తేనే నిర్మాణం ఎంత బరువైన భాద్యతో తెలుస్తుందని - అలాగే రెమ్యునరేషన్ లు వగైరా అన్నీ విషయాల్లో ఓ అవగాహన వస్తుందని అంటున్నారు.