బెంగళూరు బ్యూటీ - అందాల కథానాయిక దివ్య స్పందన ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2003లో `అభి` అనే చిత్రంతో కన్నడలో ఆరంగేట్రం చేసిన దివ్య స్పందన అదే ఏడాది తెలుగువారికి పరిచయమైంది. ఆ సినిమా `అభిమన్యు` పేరుతో తెలుగులోనూ రిలీజైంది. 2005లో `అమృత ధారే` - 2006లో `తననమ్ తననమ్` చిత్రాలలో నటనకు ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది. అటుపై దివ్యస్పందన అలియాస్ రమ్య కన్నడ - తమిళ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 2016లో `నాగరాహవు` అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత రాజకీయారంగేట్రం చేసింది.
కాంగ్రెస్ తరపున ఈ భామ మాంధ్య (కర్నాటక) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆ తర్వాత అతి పిన్న వయసులో ఎంపీ అయ్యి సంచలనం సృష్టించింది. 2014 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న రమ్య.. ప్రస్తుతం యువరాజా రాహుల్ గాంధీకి సీక్రెట్ గూఢచారిగా పని చేస్తోంది. కాంగ్రెస్ యూత్ లీడర్ గా - సోషల్ మీడియాలో ప్రచార బాధ్యతల్ని నిర్వహిస్తున్న కీలక యువనాయకురాలిగా పేరు తెచ్చుకుంది.
సామాజిక మాధ్యమాల ప్రచారం రాజకీయ పార్టీలకు కలిసొస్తున్న వేళ దివ్య లాంటి స్మార్ట్ గాళ్ ఈ కీలక బాధ్యతల్ని చేపట్టడం కాంగ్రెస్‌కి కలిసిరానుందని అంచనా వేస్తున్నారు. సహజంగానే సినీసెలబ్రిటీలకు సామాజిక మాధ్యమాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి, అది పార్టీకి ప్లస్ అవుతోందిట. జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దివ్యస్పందన సోషల్ మీడియా కాంటాక్ట్స్ అక్కరకొస్తున్నాయిట.