కోవిడ్ మహమ్మారీ సన్నివేశం ఎలా ఉందో ప్రత్యక్షంగా చూస్తున్నదే. కొన్ని కుటుంబ కథల్ని కరోనా అమాంతం ధీనస్థితికి తీసుకెళుతోంది. అసలు కోవిడ్ సోకింది అంటేనే దగ్గరకు వచ్చేందుకు బంధుమిత్రులు సైతం భయపడుతున్నారు. ఇక రంగుల ప్రపంచంలో విచిత్రాలెన్నో బయటపడుతుంటే అవన్నీ నిశ్చేష్ఠుల్ని చేస్తున్నాయి. ఇంతకుముందే తనకు తన కుటుంబానికి కోవిడ్ సోకిందని తెలిసి ఓ సినిమా నుంచి తనని అర్థాంతరంగా తొలగించారని నైతిక విలువల్ని మరిచి కనీసం ఆ విషయాన్ని కూడా తనకు చెప్పలేదని నటుడు ఆదర్శ్ బాలకృష్ణ వాపోయారు. రంగుల పరిశ్రమలో విచిత్రాలు ఇలానే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఇది అందుకు పూర్తి భిన్నమైనది. తన హీరోకి కరోనా సోకింది అనగానే దూరంగా పారిపోకుండా సదరు నిర్మాత దగ్గరుండి సాయం చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లడమే గాక సీటీ స్కాన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. కంటికి రెప్పలా చూసుకున్నారు. పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్న నిర్మాత నాగ వంశీ సాహసమిది. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ పనుల్లో ఉన్న నాగవంశీ పవన్ కి కోవిడ్ సోకిందని తెలియగానే ఆయన వెంటే ఉండి ఆశ్చర్యపరిచారు.
కోవిడ్ సోకింది అనగానే అయినవాళ్లే దూరమైపోతుంటే అతడు గట్సీగా తన హీరో వెంట నిలిచారు. ఇలాంటి విలువలు ఈరోజులలో అందరికీ అవసరం. వంశీ భార్యకు ఇంతకుముందు కోవిడ్ సోకగా ఆమె చికిత్సతో కోలుకున్నారు. మహమ్మారీతో సహజీవనానికి అలవాటు పడాల్సిన సన్నివేశం ఉందన్న సంకేతాన్ని ఈ ఉదంతం ఇండస్ట్రీ వర్గాలకు అర్థమయ్యేలా చెబుతోంది.