ఐశ్వ‌ర్యా రాయ్ ఇమేజ్ కి యూ ట్యూబ్ ఛానెల్ డ్యామేజ్!

Update: 2022-10-06 09:03 GMT
యూట్యూబ్ ఛానెల్స్  పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వైనం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌క్కువ స‌మ‌యంలోనే భారీ సబ్‌స్క్రైబర్ల‌ను పొంద‌డం కోసం ర‌క‌ర‌కాల జిమ్మిక్కులు ప్లే చేస్తున్నాయి. వీడియో క్ష‌ణాల్లోనో వైర‌ల్ అవ్వ‌డం.. మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందడం చూస్తున్నానే ఉన్నాం. చాలా ఛానెల్స్  మహిళల‌  నకిలీ థంబ్‌నెయిల్స్ తోనే పాపుల‌ర్ అవుతున్నాయి.

హెడ్డింగ్ ఒక‌టి..లోప‌ల కంటెంట్ మ‌రొక‌టి. ఆ రెండిటికి సంబంధం లేని కంటెంట్ లోప‌ల ఇంకోటి ఉంటుంది. కొన్ని ఛానెల్‌లు థంబ్‌నెయిల్‌పై తప్పుదారి పట్టించే వచనాన్ని కలిగి ఉంటున్నాయి. ఇప్పుడిదే కోవ‌లో అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు సైతం ప‌య‌నిస్తున్న‌ట్లు క‌నిప‌స్తుంది.  'ఫైర్ అండ్ బ్లడ్' అనే  ధృవీకరించబడిన యూ ట్యూబ్  ఛానెల్ ఒక‌టుంది.

ఇందులో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' మరియు 'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సిరీస్‌లకు సంబంధించిన కంటెంట్ రెగ్యుల‌ర్ గా క‌నిపిస్తుంది.  ఛానెల్ వ్యక్తిగత వినియోగదారుచే నిర్వహించబడు తున్నట్లు కనిపించినప్పటికీ యానిమేషన్ వీడియోలు ..హెచ్ బీవో   లైసెన్స్ పొందిన చిత్రాలున్నాయి.

ఈ రెండు సిరీస్‌లకు చెందిన వివిధ నటీనటుల నుండి ఆడియో వ్యాఖ్యానం..  జార్జ్ RR మార్టిన్ యొక్క కొత్త పుస్తకాలపై ప్రత్యేక అప్‌డేట్‌లు వంటి అరుదైన కంటెంట్ ని క‌లిగి ఉంది.  తాజాగా  ఈ ఛానెల్  తప్పుదారి ప‌ట్టించే థంబ్ నెయిల్స్  పెట్టి.. క‌థ‌నాల‌తో ముందుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది.  

యానిమేషన్ ద్వారా హౌస్ మార్టెల్  మూలాల గురించి వివరించే  తాజా వీడియో కోసం వారు ఐశ్వర్య రాయ్ చిత్రాన్ని థంబ్‌నెయిల్‌గా ఉంచారు. థంబ్‌నెయిల్‌పై అధికారిక హెచ్ బీవో  లోగో కూడా ఉంది. దీంతో ఐశ్వ‌ర్యా రాయ్ కూడా వెబ్ సిరీస్‌లో భాగ‌మైంద‌ని చాలామంది భావించారు.  కానీ వీడియోలోప‌లికి వెళ్లి చూస్తే  అలాంటిదేమీ లేదు.

పేరు ఒక‌రిది...క్రెడిట్ మ‌రొక‌ర‌ది అన్న మాదిరిగా ఐశ్వ‌ర్యారాయ్ ఇమేజ్ క్లిక్ కోసం అలాంటి జిమ్మిక్ ప్లే చేసారు.  వాస్త‌వానికి  ఐశ్వర్య రాయ్ యొక్క ఆ చిత్రాలు  2007లో తీసిన 'ది లాస్ట్ లెజియన్' చిత్రానికి సంబంధించినవి.  ఇప్పుడా పాత ఫోటోల‌తో ఎన్ క్యాష్ చేసుకోవాల‌ని స‌ద‌రు యూ ట్యూబ్ ఛాన‌ల్ ప్లాన్ చేసింది.  అయితే అధికారిక హెచ్ బీవో లోగో క‌నిపించ‌డం ఇక్క‌డ ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. మ‌రి  యూట్యూబ్ ఛానెల్ పై ఐశ్వ‌ర్యారాయ్ చ‌ట్ట‌ప‌ర‌మైన చ్య‌లు ఏవైనా తీసుకుంటుందా? అన్నది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News