యాత్ర ఎన్టీఆర్ క్లాష్ ఇలా కుదిరిందే

Update: 2019-02-08 11:32 GMT
అన్ని సవ్యంగా ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే ఈ రోజు యాత్ర విడుదలతో పాటు రేపు ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అయ్యేది. ఇద్దరు రాజకీయ దిగ్గజాల బయోపిక్ క్లాష్ కు బాక్స్ ఆఫీస్ వేదికగా మారేది. సోషల్ మీడియా పోలికలతో హోరెత్తిపోయేది. కాని కథానాయకుడు ఫలితం చూసాక స్లో అయిపోయిన క్రిష్ టీం మహానాయకుడు డేట్ ని ఇప్పటికీ తేల్చకుండా షూటింగ్ చేస్తూనే ఉంది. అసలు ఫిబ్రవరిలో వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

అయితే ఎన్టీఆర్ తో యాత్ర క్లాష్ ఇంకో రకంగా జరగడం గమనించాల్సిన అంశం. నిన్న రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ తన సైట్ లో ఎన్టీఆర్ కథానాయకుడు స్ట్రీమింగ్ పెట్టిన సంగతి తెలిసిందే. 8న విడుదల అంటూ ప్రకటనలు గత రెండు రోజుల నుంచి ఇస్తూనే ఉన్నారు. ఇటుపక్క యాత్ర థియేట్రికల్ రిలీజ్ 8 అని నెల క్రితమే ఫిక్స్ అయ్యారు. సో వెండితెరపై యాత్ర బుల్లితెరపై కథానాయకుడు ఒకే రోజు ప్రేక్షకులను పలకరించాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే యాత్ర హక్కులు కూడా అమెజాన్ ప్రైమ్ వద్దే ఉన్నాయి.

అగ్రిమెంట్ ప్రకారం రెండు మూడు స్లాట్స్ లో అమెజాన్ రైట్స్ ని కొనుగోలు చేస్తోంది. 30 లేదా 45 లేదా 50 రోజులు ఈ ప్రాతిపదికన ఖచ్చితంగా డేట్ మిస్ కాకుండా అప్ లోడ్ చేస్తోంది. ఈ మధ్య అమెజాన్ లో వచ్చిన సినిమాలన్నీ ముప్పై రోజుల గడువుతో వచ్చినవే. ఎఫ్2 కూడా 11న రాబోతోందని ఇప్పటికే టాక్ ఉంది. సో యాత్ర ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేం. ఒకవేళ మహానాయకుడు ఆలస్యం అయిపోయి యాత్ర అమెజాన్ లో వచ్చే రోజున అది థియేటర్ లో వచ్చేలా ఉంటుందేమో చూడాలి. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగినది కాకపోయినా కాకతాళీయంలోనూ బాక్స్ ఆఫీస్ వద్ద వైఎస్ఆర్ ఎన్టీఆర్ లు ప్రత్యర్థులు కాక తప్పలేదు
   

Tags:    

Similar News