కొత్త ఏడాదిలో సినీ ప్రేక్షకులకు సరికొత్త సర్ ఫ్రైజ్ ఇచ్చాడు కోలీవుడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్. దాదాపు పదేళ్లుగా నానుతున్న ‘ఆయిరతిల్ ఒరువన్’(తెలుగులో యుగానికి ఒక్కడు) సీక్వెల్ ను ఎట్టకేలకు ప్రకటించాడు సెల్వ. సూపర్ స్టార్ ధనుష్ తో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ టీజర్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
తమిళ్ లో విలక్షణ దర్శకుడిగా పేరుగాంచిన సెల్వరాఘవన్ చిత్రాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. 7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఇక 2010లో విడుదలైన ‘యుగానికి ఒక్కడు’ మూవీ మాసివ్ హిట్ సొంతం చేసుకుంది. కార్తీ హీరోగా నటించిన ఈ అద్భుత చిత్రానికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. సీక్వెల్ కోసం కూడా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.
తమిళ్, తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ చిత్రం ఒక వండర్ లా నిలిచిపోయింది. మళ్ళీ పదేళ్ల తర్వాత పార్ట్ 2 వస్తుందని చెప్పడంతో అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. పలు సందర్భాల్లో సీక్వెల్ గురించి మాట్లాడుతూ వచ్చిన డైరెక్టర్ సెల్వ.. మొత్తానికి ప్రారంభించబోతున్నట్టు నూతన సంవత్సరంలో ప్రకటించారు.
అయితే.. ఈ భారీ చిత్రం సీక్వెల్ లో కార్తీ బదులుగా.. ఈసారి ధనుష్ ను తీసుకున్నాడు డైరెక్టర్. కథానుసారం వేరే హీరోను తీసుకోవాల్సి వచ్చిందా..? లేదా మరేదైనా కారణం ఉందా? అనేది తెలియదు కానీ.. ధనుష్ ను ఫైనల్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను తన ట్విటర్ అకౌంట్ లో పోస్టు చేశాడు ధనుష్. ‘ఇదొక మహత్తరం.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే సంవత్సరం పడుతుంది. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి మావంతు కృషి చేస్తాం. ‘ఆయిరతిల్ ఒరువన్’ యువరాజు 2024లో తిరిగి రాబోతున్నాడు’ అని ట్వీట్ చేశాడు ధనుష్.
దర్శకుడు రిలీజ్ చేసిన ఈ కాన్సెప్ట్ పోస్టర్ వైరల్ అవుతోంది. అయితే.. ఈ పోస్టర్ చూస్తే ‘యుగానికి ఒక్కడు’ చిత్రం ఎక్కడైతే ముగిసిందో.. అక్కడే సీక్వెల్ ప్రారంభమవుతుందని అర్థమవుతోంది. మొదటి పార్టులో హీరో కార్తీ చోళ యువరాజు అయిన బాలుడిని శత్రువులైన పాండ్యాల నుంచి కాపాడి, భుజాన వేసుకొని అడవుల్లోకి వెళ్లిపోతాడు. అక్కడితో సినిమా ముగుస్తుంది. మరి, ఆ బాల యువరాజే సీక్వెల్ లో హీరో అవుతాడా? అదే జరిగితే.. మొదటి భాగంలో హీరోగా ఉన్న కార్తీ పాత్రను ఎలా ముగిస్తారు? అనేవి ఆసక్తికరమైన అంశాలు.
కాగా.. ‘ఆయిరతిల్ ఒరువన్-2’ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించబోతున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరవింద్ కృష్ణ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇక, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. 2024లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.