అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మూడో తరం హీరో యవసామ్రాట్ నాగచైతన్య. తాత నట సామ్రాట్ నాగేశ్వరరావు - తండ్రి కింగ్ నాగార్జున లెగసీని కొనసాగిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు చైతన్య. తొలి సినిమా 'జోష్' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. 'ఏమాయ చేసావే' చిత్రంతో తనేంటో ప్రేక్షకులకు తెలియజెప్పారు. అప్పటి నుంచి సినిమా సినిమాకు మెరుగు పరచుకుంటూ వస్తున్న చైతన్య.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు.
'100% లవ్' 'తడాఖా' 'మనం' 'ఒక లైలా కోసం' 'ప్రేమమ్' 'రారండోయ్ వేడుక చూద్దాం' 'మజిలీ' వెంకీమామ' వంటి విజయవంతమైన సినిమాలు నాగచైతన్య కెరీర్ లో ఉన్నాయి. ఇటీవల 'లవ్ స్టోరీ' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తన తండ్రితో కలిసి 'బంగార్రాజు'.. విక్రమ్ కుమార్ తో 'థాంక్యూ' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ హరర్ వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు చైతూ.
రేపు (నవంబర్ 23) నాగచైతన్య తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి అక్కినేని అభిమానులు ప్రణాళికలు సిద్ధం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని అభిమాన సంఘాలు ఏర్పాట్లు చేసాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో #HBDYuvasamratNagaChaitanya అనే హ్యాష్ ట్యాగ్ తో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అలానే చైతూ బర్త్ డే స్పెషల్ గా కామన్ డిస్ప్లే పిక్చర్ (డీపీ)ని రూపొందించి సందడి మొదలు పెట్టారు.
టాలీవుడ్ సినీ ప్రముఖులు - నిర్మాణ సంస్థలతో పాటుగా అక్కినేని ఫ్యాన్స్ నాగచైతన్య కామన్ డీపీ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. పిడికిలి మీద చైతూ నటించిన సినిమాలకు సంబంధించిన పాత్రలతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇకపోతే ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి చైతన్య నటిస్తున్న రెండు సినిమాల నుంచి న్యూ అప్డేట్స్ రాబోతున్నాయి. లేటెస్టుగా వచ్చిన 'బంగార్రాజు' ఫస్ట్ లుక్ అనూహ్య స్పందన తెచ్చుకోగా.. మంగళవారం ఉదయం టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇదే క్రమంలో 'థాంక్యూ' సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల కానుంది. అంటే చై బర్త్ డే కానుకగా అభిమానులకు డబుల్ ట్రీట్ రాబోతోందన్నమాట.
ఇదిలా ఉంటే నాగచైతన్య తన భార్య సమంత తో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత వస్తున్న ఈ పుట్టినరోజు పై అందరి దృష్టి ఉంది. చైతూ గత కొన్నేళ్లుగా సామ్ తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇది విడాకుల ప్రకటన తర్వాత వస్తున్న ఫస్ట్ బర్త్ డే. ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియా వేదికగా చైతన్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుందా లేదా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా సామ్ తో వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన చైతన్య.. కెరీర్ మీద ఫోకస్ పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.