సోనాక్షితో డేటింగ్.. రివీల్ చేసిన యంగ్ హీరో

Update: 2020-04-14 12:10 GMT
బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ ప్రోద్బలంతో గత ఏడాది హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జహీర్ ఇక్బాల్.  తన స్నేహితుడి కుమారుడిని బాలీవుడ్ ఇండస్ట్రీకి సల్మాన్ ఖాన్ పరిచయం చేశాడు. అయితే ఈ మూవీ కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ జహీర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

తాజాగా ఈ యువ హీరో జహీర్ కు బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హాతో డేటింగ్ కొనసాగుతోందని బాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేశాయి. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు ఫొటోలు కనిపించడంతో అందరూ నిజమేనని అనుకున్నారు.

ఈ గాసిప్పులపై తాజాగా యువ హీరో జహీర్ ఇక్బాల్ స్పందించారు.  డేటింగ్ రూమర్లు చూసి తాను, సోనాక్షి సిన్హా నవ్వుకున్నామని తెలిపారు. దీనిపై ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియడం లేదని తెలిపారు.

అయితే ఈ రూమర్ తన వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టిందని జహీర్ వివరించాడు. తాను ఎవరితో డేటింగ్ లో ఉన్నానో  సోనాక్షికి తెలుసు కాబట్టి తన ప్రియురాలి నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. ఇలా సోనాక్షితో తనకు  ఎఫైర్ లేదన్న విషయాన్ని వివరించాడు యువ హీరో జహీర్.

జహీర్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘కబీ ఈద్ కబీ దీవాళి’ సినిమాలో ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడని తెలిసింది.
Tags:    

Similar News