మహేష్ బాబు వెండి తెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా సూపర్ స్టారే. అతడి సినిమాలు టీవీల్లోనూ సూపర్ హిట్ అయిపోతుంటాయి. ఖలేజా లాంటి డిజాస్టర్ సైతం టీవీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం విశేషం. అందుకే ప్రముఖ టీవీ ఛానెళ్లు అతడి సినిమాల శాటిలైట్ రైట్స్ కోసం ఎగబడుతుంటాయి. మహేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘శ్రీమంతుడు’ను జీ తెలుగు ఛానెల్ పది కోట్ల రూపాయలకు పైనే పెట్టి కొన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ ఫిగర్ ఎంతన్నది కరెక్టుగా తెలియలేదు కానీ.. ఆ ప్రైస్ కు తగ్గట్లే ఫస్ట్ ప్రిమియర్ షోతో భారీగా ఆదాయం అందుకుంది ఆ ఛానెల్. ఇప్పటికే ఈ సినిమా రెండుసార్లు టీవీలో ప్రసారమైంది. రెండోసారి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది.
మహేష్ సినిమా రుచి మరిగిన జీ తెలుగు ఛానెల్ ప్రిన్స్ తర్వాతి సినిమా ‘బ్రహ్మోత్సవం’ మీద కూడా కన్నేసింది. నిర్మాత పొట్లూరి వరప్రసాద్ వేరే ఛానెళ్లతో సంప్రదింపులు జరుపుతుండగానే ఈ ఛానెల్ ప్రతినిధులు ఎవ్వరూ అందుకోలేనంత ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి ‘బ్రహ్మోత్సవం’ను కొనేసినట్లు సమాచారం. మహేష్ సినిమాల్లో శాటిలైట్ రైట్స్ పరంగా అత్యధిక రేటు పలికింది ఈ సినిమానేనట. మరోవైపు ‘బ్రహ్మోత్సవం’ థియేట్రికల్ రైట్స్ కోసం కూడా విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఒక్క ఓవర్సీస్ కే రూ.13 కోట్ల దాకా బేరం తెగినట్లు సమాచారం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ కూడా ఓ రేంజిలో జరుగుతోందట. మొత్తం గా ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు రూ.80 కోట్ల దాకా తెచ్చి పెట్టే అవకాశాలున్నాయని సమాచారం.