సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుని క్లీన్ 'యూ' సర్టిఫికెట్ పొందింది. అయితే ఇన్నాళ్లు థియేట్రికల్ రిలీజ్ లేదా డిజిటల్ రిలీజ్ అనే దానిపై డైలామాలో ఉన్న మేకర్స్ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
కరోనా కారణంగా థియేటర్స్ క్లోజ్ అవడంతో మూవీస్ అన్నీ డైరెక్ట్ ఓటీటీలలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని జీ 5 ఒరిజినల్ ఓటీటీ సుమారు రూ.30 కోట్లకు తీసుకుందని ఓటీటీ వర్గాల్లో టాక్. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తో పాటు థియేటర్ రిలీజ్ రైట్స్ హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా జీ 5 వారికే అనే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. ముందుగా ఓటీటీ వారు పే పర్ వ్యూ పద్ధతిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పుడు ముందుగా థియేట్రికల్ రిలీజ్ చేసి ఆ తర్వాత డిజిటల్ రిలీజ్ కి వెళ్లాలని ఆలోచిస్తున్నారట. మరి త్వరలోనే 'సోలో బ్రతుకే సో బెటర్' దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.