సర్దార్ 2: రంగంలోకి ట్రెండింగ్ బ్యూటీ

కన్నడ బ్యూటీస్ ఈ మధ్యకాలంలో సౌత్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు.

Update: 2024-08-05 07:25 GMT

కన్నడ బ్యూటీస్ ఈ మధ్యకాలంలో సౌత్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు. అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడీగా నటించిన కన్నడ భామ ఆషికా రంగనాథ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత కింగ్ నాగార్జునతో నా సామి రంగా మూవీ చేసి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ హిట్ టాక్ తో అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మూవీ విశ్వంభర సినిమాలో ఆషికా రంగనాథ్ ఛాన్స్ సొంతం చేసుకుంది. అయితే విశ్వంభరలో ఆమె చేయబోతున్న రోల్ ఏంటనేది క్లారిటీ లేదు.


2016లో క్రేజీ లవ్ అనే కన్నడ సినిమాతో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి రెగ్యులర్ గా కన్నడ మూవీస్ చేస్తూ వస్తోంది. కన్నడ నాట స్టార్ హీరోయిన్స్ లలో ఒకరుగా ఈ బ్యూటీ ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు కన్నడ సినిమాలు ఉన్నాయి. అలాగే తమిళంలో మిస్ యు అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు కోలీవుడ్ లో మరో పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ అందుకుంది.

కార్తీ హీరోగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన సర్దార్ కి సీక్వెల్ ప్రస్తుతం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ రెడీ అవుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తోంది. ఇప్పుడు ఆషికా రంగనాథ్ కూడా ఈ చిత్రంలో నటిస్తుందని నిర్మాణ సంస్థ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ప్రిన్స్ పిక్చర్స్ ఆషికా రంగనాథ్ కి స్వాగతం చెబుతూ ఒక ఫోటో స్టిల్ ని ట్విట్టర్ లో షేర్ చేసింది.

తమిళ్, తెలుగు భాషలలో తెరకెక్కుతోన్న ఇంత పెద్ద సినిమాలో ఆషికా రంగనాథ్ ఛాన్స్ అందుకోవడం ఆమె కెరియర్ కి చాలా ప్లస్ అనే మాట వినిపిస్తోంది. నటిగా తన క్రేజ్ పెంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. విశ్వంభర, సర్దార్ 2 సినిమాలు రెండు వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. సర్దార్ షూటింగ్ కూడా ఆమె జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కార్తీ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లలో సర్దార్ ఒకటి.

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం ఉంటుంది. కాబట్టి దానికి సీక్వెల్ అంటే మార్కెట్ లో డిమాండ్ గట్టిగానే ఉంటుంది. ఇక సర్దార్ మూవీలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు సర్దార్ 2లో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ అవకాశాలు అందుకున్నారు. మరి ఈ మూవీలో వీరిద్దరి పాత్రలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News