ఆషికా రంగనాధ్ ఆశ చాలా పెద్దదే!
రెండవ సినిమాతోనే ఏకంగా కింగ్ తోనే రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకోవడం గ్రేట్ అనే అనాలి.
'అమిగోస్` తో టాలీవుడ్ కి పరిచయమైన ఆషికా రంగనాధన్ సుపరిచితమే. అమ్మడు తొలి సినిమాతోనే అందం..అభినయంతో ఆకట్టుకుంది. ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించనప్పటికీ బ్యూటీకి కొత్త అవకాశాలు బాగానే వరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున సరసన `నా సామిరంగ`లో నటించే ఛాన్స్ ఒడిసి పట్టుకుంది. రెండవ సినిమాతోనే ఏకంగా కింగ్ తోనే రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకోవడం గ్రేట్ అనే అనాలి.
ఎంతో మంది భామలున్నా ఆషికాని వెతుక్కుంటూ మరీ ఈ ఛాన్స్ వెళ్లింది. తాజాగా నా సామిరంగ రిలీజ్ నేపథ్యంలో ఆషికా ఛాన్స్ అందుకోవడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్ నన్ను సంప్రదించి నప్పుడు షాక్ అయ్యాను. నాకు ఛాన్స్ ఏంటి అనుకున్నాను. నాలాంటి కొత్త వారికి నాగ్ సార్ తో నటించే ఛాన్స్ రావడం లక్ అనుకున్నాను. ఇందులో వరాలు పాత్రలో కనిపిస్తా. అలియాస్ వరలక్షి. వరాలు ఇందులో రెబల్ గా కనిపిస్తుంది. నాగార్జున రొమాంటిక్ హీరో.
అందుకు తగ్గట్టు సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలున్నాయి. స్టోరీ ఆధారంగా సినిమాలో అవి కనిపిస్తాయి. మిగతా పెయిర్స్ మధ్య మంచి రొమాన్స్ ఉంది. విజయ్ కొత్త వాడైనా సీనియర్ లా తెరకెక్కించారు. గ్లామర్ తో పాటు నటన ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలి. అలాగే పీరియాడిక్ సినిమాలు చేయాలని ఉంది. అన్నింటికి మంచి ఏదో ఒక రోజు రాజమౌళి సినిమాలో నటించాలన్నది నా కోరిక.
నవ్వుతూ చెబుతూనే నేను మాత్రం చాలా సీరియస్ గానే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని తెలిపింది. మొత్తానికి అమ్మడు రాజమౌళి తో ఛాన్స్ కోసం ముందుగానే కర్చీప్ వేసిందని చెప్పొచ్చు. త్వరలోనే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సినిమాలో మహేష్ సరసన కాకపోయినా చిన్న రోల్ వచ్చినా? ఆషికా డ్రీమ్ నెరవేరినట్లే కదా.