అషు.. ఇంతకంటే ఘాటైన లుక్ మరొకటి ఉంటుందా?
ఆషు తన మొదటి రోజుల్లో షార్ట్ వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది, ఆ తర్వాత టెలివిజన్ షోలలో పాల్గొని పేరు పొందింది.
ఆషురెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. మొదట జూనియర్ సమంతగా పాపులర్ అయిన ఆషురెడ్డి, ఇప్పుడు తన ప్రత్యేకమైన స్టైల్‌తో, ఆహార్యంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఆషు తన మొదటి రోజుల్లో షార్ట్ వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది, ఆ తర్వాత టెలివిజన్ షోలలో పాల్గొని పేరు పొందింది.
రెండు సార్లు బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఆ షో తర్వాత ఆషు ఓటీటీ, టీవీ షోలలో హోస్ట్‌గా రాణించింది. తన నమ్మకాన్ని మరింతగా పెంచుకున్న ఆమె, సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో రోజూ కనెక్ట్ అవుతూ హాట్ ఫోటోషూట్స్‌తో అభిమానులను మెప్పిస్తోంది. ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు ఊహించని గుర్తింపు తెచ్చింది.
అలాగే ఆమె ఇమేజ్ను పూర్తిగా మార్చింది. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా కనిపించిన ఆషు, ఇప్పుడు స్లిమ్ లుక్‌లోకి మారి, బాలీవుడ్ నాయికలతో పోటీ చేసే రేంజ్లో గ్లామర్ ప్రదర్శన చేస్తోంది. ఆషు తాజాగా రెడ్ కలర్ బ్లేజర్ లో పోజులు ఇచ్చిన విధానం స్టన్ అయ్యేలా చేస్తోంది, ఆ ఫోటోలని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఆమె గ్లామర్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆమె ఏంజిల్ లా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఆషురెడ్డి ఇప్పుడు టాలెంట్‌తో పాటు గ్లామర్ షోలోనూ తన ప్రత్యేకతను చూపిస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె సూపర్ హీరో కాన్సెప్ట్ మీద తెరకెక్కుతున్న "ఏ మాస్టర్ పీస్" అనే సినిమాలో నటిస్తోంది. మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.