గోల్డెన్ డ్రెస్సులో అషు రెడ్డి.. వావ్ అనాల్సిందే!
ఆషురెడ్డి తన కెరియర్ ప్రారంభంలో బొద్దుగా ఉండేది కానీ, ఇప్పుడు స్లిమ్ లుక్ లోకి మారి స్టార్ హీరోయిన్స్ కి సైతం పోటీ ఇవ్వగల రేంజ్ లో ఉంది.
తెలుగు ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా సుపరిచితమైన పేరు ఆషురెడ్డి. జూనియర్ సమంత అనే ట్యాగ్ లైన్ తో షార్ట్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఆమె, తన అందం మరియు టాలెంట్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. రియాలిటీ షోలు, బిగ్ బాస్ వంటి కార్యక్రమాలలో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. ఆమె ఎలా కనిపించినా అందనికే అందం అనేలా క్రేజ్ అందుకుంది.
ఆషురెడ్డి తన కెరియర్ ప్రారంభంలో బొద్దుగా ఉండేది కానీ, ఇప్పుడు స్లిమ్ లుక్ లోకి మారి స్టార్ హీరోయిన్స్ కి సైతం పోటీ ఇవ్వగల రేంజ్ లో ఉంది. ఆమె గ్లామర్ షో సోషల్ మీడియా వేదికలపై హాట్ టాపిక్ అవుతోంది. ఆ మధ్య ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. అనంతరం సోషల్ మీడియాలో ఆమె బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆషురెడ్డి, రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తూ ట్రెండింగ్ లిస్టులో కొనసాగుతూ ఉంటుంది. ఇటీవల ఆమె ఇటీవల గోల్డెన్ కలర్ లాంగ్ డ్రెస్ లో తీసుకున్న ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఫ్యాన్స్ నుండి మంచి స్పందన పొందుతున్నాయి.
ఒకవైపు తన లుక్స్ తో మరోవైపు ఎద అందాలతో అమ్మడు మతిపోగొట్టేసింది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఆషురెడ్డి కేవలం సోషల్ మీడియా స్టార్ మాత్రమే కాదు, నటిగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంది. "చల్ మోహన రంగా" చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆషురెడ్డి, "బాయ్ ఫ్రైండ్ ఫర్ హైర్" అనే చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది.
ప్రస్తుతం "ఏ మాస్టర్ పీస్" అనే సూపర్ హీరో మూవీలో నటిస్తోంది. అదేవిధంగా మరికొన్ని సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఆషురెడ్డి తన కెరియర్ లో ప్రతిసారి కొత్తదనం తీసుకురావడం ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఆమె ప్రయాణం, వెండితెర వరకు కొనసాగుతూ, ప్రేక్షకులకు తన ప్రత్యేకతను చాటుకుంది. ఆషురెడ్డి అందం, టాలెంట్, వినోదంతో ప్రేక్షకులను అలరిస్తూ, తానేంటో నిరూపించుకుంటోంది. మరి రాబోయే రోజుల్లో అమ్మడు ఇంకా ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.