కల్కి పార్ట్ 2 తరువాత.. ఇది అయ్యే పనేనా?

ఇదిలా ఉంటే ఈ మూవీ సక్సెస్ మీట్ లో నిర్మాత అశ్వినీదత్ సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2024-07-01 15:30 GMT

కల్కి 2898ఏడీ చిత్రంలో యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో సుప్రీమ్ యాస్కిన్ గా నటించాడు. కల్కి మొదటి పార్ట్ లో కమల్ హాసన్ చేసిన సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ కనిపించేది రెండు సన్నివేశాలలో మాత్రమే. అయిన కూడా సినిమాపై ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. ఇక పార్ట్ 2లో అయితే సుప్రీమ్ యాస్మిన్ క్యారెక్టర్ పూర్తి నిడివిలో కనిపిస్తుందని ఇప్పటికే స్పష్టం అయ్యింది.

సుప్రీమ్ యాస్కిన్ నుంచి సుమతి గర్భంలో ఉన్న కల్కిని అశ్వద్ధామ, భైరవగా పుట్టిన కర్ణుడు ఎలా కాపాడుతారు. ధర్మ స్థాపన కోసం ఇద్దరు ఎలాంటి పోరాటం చేయనున్నారు అనేది పార్ట్ 2లో చూపించబోతున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ద్వాపరయుగంలో అధర్మం వైపు నిలబడ్డ అశ్వద్ధామ, కర్ణుడు కలియుగాంతంలో ధర్మం వైపు నిలబడి భగవంతుడు ఈ భూమిపై అవతరించేలా ఎలా చేస్తారనేది నాగ్ అశ్విన్ ఇంటరెస్టింగ్ గా చెప్పబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీ సక్సెస్ మీట్ లో నిర్మాత అశ్వినీదత్ సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. కల్కి పార్ట్ 2 తర్వాత సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ తో కంప్లీట్ గా ఒక మూవీ చేసే ఆలోచన ఉందని, దానిపై సాధ్యాసాధ్యాలు చర్చించనున్నట్లు తెలిపారు. కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ లో ఉన్న సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ తో సినిమా చేస్తే అది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందనేది చెప్పలేని విషయం.

Read more!

విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రలో అత్యంత కిరాతకుడైన గ్యాంగ్ స్టార్ గా క్లైమాక్స్ లో కనిపించారు. రోలెక్స్ పాత్రలో మూవీ చేస్తానని లోకేష్ గతంలో ప్రకటించారు. అలాగే కల్కి మూవీలో కూడా కిరాతక పాత్ర అయిన సుప్రీమ్ యాస్కిన్ కథతో మూవీ చేస్తామని నిర్మాత అశ్వినీదత్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. మూవీలో హీరోయిజం లేకుండా కంప్లీట్ గా నెగిటివ్ క్యారెక్టరైజేషన్ తో కథనం చెప్పే ప్రయత్నం చేస్తే ఆడియన్స్ ఎంత రిసీవ్ చేసుకుంటారా అనే సందేహాలు అందరికి వస్తున్నాయి.

అది కూడా కమల్ హాసన్ తో పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్ట్ తెలుగులో చేయడం అంటే అది రిస్క్ అయ్యే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. కమల్ హాసన్ ని తమిళ్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకుంటారు. మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా బలమైన ప్రతినాయకుడు ఉన్నప్పుడు వాడిని ఎదిరించే బలమైన కథానాయకుడిని కూడా మూవీలో చూడాలని అనుకుంటారు. అయితే ముందుగా కల్కి పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత నాగ్ అశ్విన్ ఆలోచన మీద సుప్రీమ్ యాస్కిన్ మూవీ ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News