రాజమౌళితో సినిమా ఆశ ఇప్పటికీ అలాగే!
బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ సైతం మీడియా ముందే దత్ కాళ్లకు నమస్కరించి ఆయన స్థానాన్ని మరింత గా పెంచారు.
ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. నాటి-నేటి జనరేషన్ హీరోలతోనూ సినిమాలు నిర్మించి సత్తా చాటుతున్నారు. ఇటీవలే `కల్కి 2898` విజయంతో పాన్ ఇండియాలోనూ అతడి పేరు మారుమ్రోగిపోయింది. బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ సైతం మీడియా ముందే దత్ కాళ్లకు నమస్కరించి ఆయన స్థానాన్ని మరింత గా పెంచారు.
అయితే అమితాబ్ సర్ నా కాళ్లకు నమస్కరించడం ఏంటో? నాకు అర్దం కాలేదని ఆ తర్వాత దత్ మరో సందర్భంలో ఉన్నారు. ఏద ఏమైనా అది సంచలనమైన విషయంగా మారింది. ఆ సంగతి పక్కన బెడితే తాజాగా రాజమౌళితో సినిమా నిర్మించాలని ఉందనే మనసులో కొర్కెను అశ్వీని దత్ బయట పెట్టారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
రాజమౌళి తెరకెక్కించిన `స్టూడెంట్ నెంబర్ వన్` సినిమాతో ఆయన తొలి సినిమా. దానికి నేను సమర్పకుడిగా వ్యవరించాను. మొదటి చిత్రాన్నే ఆయన ఎంతో గొప్పగా తీసారు. ఇప్పుడాయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజమౌళితో కలిసి పనిచేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా. కాకపోతే కుదరడం లేదు. ఇప్పటికీ ఆ ఆశ అలాగే ఉంది` అని అన్నారు.
ఇప్పుడా ఆ ఆశ నెరవేరాలంటే? రాజమౌళి ఒకే చెప్పాలి. ఇది ఆయన చేతుల్లో పని. ఆయనతో సినిమాలు నిర్మించడానికి ఎంతో మంది నిర్మాతలతో పాటు, మరెన్నో కార్పోరేట్ కంపెనీలు సైతం క్యూలో ఉన్నాయి. వందల కోట్లు కాదు..వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ ఛాన్స్ తీసుకోవాల్సింది రాజమౌళి. ఆయన కరుణిస్తే తప్ప నిర్మాతగా అవకాశం రాదు.