కల్కి.. ఫ్యాన్స్ కు మరో టెన్షన్!?
ఇప్పుడు అశ్వనీ దత్ కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అసలే ఆయన నిర్మిస్తున్న చిత్రాల్లో ప్రభాస్ భారీ ప్రాజెక్ట్ కల్కి కూడా ఉంది. ఈ
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు పరిణామాలు మెల్లగా తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి ఎవరూ స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఒక్కోక్కరిగా స్పందిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే నిర్మాత నట్టికుమార్, దర్శకేంధ్రుడు రాఘవేంద్రరావు, కోలీవుడ్ నుంచి రజనీకాంత్ వంటి ప్రముఖులు మాట్లాడగా.. తాజాగా మరో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఓ వీడియో బైట్‌ను రిలీజ్ చేసి మాట్లాడారు.
ఈ వీడియో బైట్‌లో ఆయన చంద్రబాబుకు మద్దతు పలుకుతూ అధికార వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకంటే మద్దతు పలికిన వారిలో ఆయనే కాస్త యాక్టివ్‌గా ఉన్నారు. వరుసగా సినిమాలను నిర్మిస్తున్నారు.
అసలే తమకు వ్యతిరేకంగా మాట్లాడితే పరిణామాలు ఎలా ఉంటాయో పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో వచ్చే మాటలను వింటూనే ఉన్నాం. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ టికెట్ రేట్లతో పెద్ద రచ్చే అయింది.
ఇప్పుడు అశ్వనీ దత్ కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అసలే ఆయన నిర్మిస్తున్న చిత్రాల్లో ప్రభాస్ భారీ ప్రాజెక్ట్ కల్కి కూడా ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. కచ్చితంగా టికెట్ రేట్లు పెంచితే గానీ బడ్జెట్ రికవరీ అవ్వదు.
టికెట్ రేట్లు పెంచాలంటే మళ్లీ అదే అధికార ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో అశ్వనీ దత్‌కు ఇదంతా అవసరమా అని ప్రభాస్ అభిమానులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో ప్రాజెక్ట్ కె కల్కి ఎలక్షన్స్ అయ్యాకే విడుదల అవుతుందని, అప్పుడు జగన్ ప్రభుత్వం మళ్లీ రాదనే ఉద్దేశంతోనే అశ్వనీ ఇంత ధైర్యంగా ధీమాతో కామెంట్లు చేశారని ఇంకొంతమంది అంటున్నారు.
ఏదిఏమైనా.. వైసీపీ ప్రభుత్వం రాకపోతే ఓకే కానీ.. ఒకవేళ వస్తే ప్రభాస్ కల్కికి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఫైనల్‌గా ఏపీ రాజకీయ వేడి, చంద్రబాబు అరెస్ట్ పరిణామాలు సినిమా ఇండస్ట్రీపై ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోందని చెబుతున్నారు. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుందో..