నాగ్ అశ్విన్ గురించి మామ అలా ఎందుకు అన్నట్లు?
ఈ నేపథ్యంలో తాజాగా నాగ్ అశ్విన్ గురించి ఓ ఇంటర్వ్యూలో నిర్మాత, పిల్లని ఇచ్చిన మామ అశ్వీనిదత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
'కల్కి 2898' విజయంతో నాగ్ అశ్విన్ పేరు దేశవ్యాప్తంగా మారు మ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. దేశమంతా నాగీవైపు చూస్తోంది. ఎవరి ఇంతటి ట్యాలెంటెడ్ దర్శకుడు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? టాలీవుడ్ నుంచి ఇంత గొప్ప దర్శకుడా? రాజమౌళినే మించిన దర్శకుడంటూ అంతా ఆశ్చర్య పోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నాగ్ అశ్విన్ గురించి ఓ ఇంటర్వ్యూలో నిర్మాత, పిల్లని ఇచ్చిన మామ అశ్వీనిదత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
'జనం దృష్టిలో నాగ్ అశ్విన్ గొప్ప వ్యక్తి. కానీ ఆయన గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. హడావుడిగా మా ఇంటికి వస్తాడు. చెప్పులు బయట విడిచి లోపలికి వస్తాడు. వెళ్లేటప్పుడు నా చెప్పులు వేసుకుని వెళ్లిపోతాడు. ఆశ్చర్యం ఏంటంటే వచ్చేటప్పుడు కూడా వాళ్ల నాన్న చెప్పులు వేసుకుని వస్తాడు' అని అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలు దత్ ఎందుకు చేసినట్లు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ నాగీ గురించి ఎక్కడా అలా మాట్లాడింది లేదు. అలాగే 'కల్కి-2' గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. 'కథ చర్చల దశలో ఉండగానే సినిమాని రెండు భాగాలుగా చేయాలనుకున్నాం. కమల్ హాసన్ సినిమాలో భాగం అవ్వగానే సినిమాలో భాగం అవ్వగా నే కచ్చితంగా రెండు భాగాలు చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నాం.
ఇండస్ట్రీకి మేం వచ్చి 50 ఏళ్లు దాటింది. నా మొదటి సినిమా నుంచి దర్శకుడు చెప్పింది విని, వారి విజన్ కి ఏం కావాలో అవి ఇస్తూ వచ్చాను. ఎందుకు? ఏంటి? అని ఎప్పుడు అడిగింది లేదు. ఆ రోజుల్లో ఇండస్ట్రీకి నిర్మాతలగా వచ్చిన వారిలో నేను, అల్లు అరింద్ మాత్రమే కొనసాగుతున్నాం. ఇండస్ట్రీలో అనేక సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించుకుంటూ ముందుకెళ్లడమే' అని అన్నారు.