కోటి పెడితే 11 కోట్లు తెచ్చిన సినిమా
కల్కి 2898ఏడీ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ అందించారు.
టాలీవుడ్ లో బడా నిర్మాతగా కె అశ్వినీదత్ తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. సుదీర్ఘమైన తన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన సినిమాలని నిర్మాతగా ప్రేక్షకులకి అందించారు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' లాంటి సెన్సేషనల బ్లాక్ బస్టర్ సినిమాని అంత తొందరగా ఎవరు మరిచిపోరు. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఆయన చాలా చేశారు. ఎన్టీఆర్ 'ఎదురులేని మనిషి' సినిమాలతో నిర్మాతగా అశ్వినీదత్ కెరియర్ ప్రారంభించారు. నిర్మాతగా ఆయనది 50 ఏళ్ళ సినీ ప్రయాణం.
టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా నిర్మాణ సంస్థలుగా సక్సెస్ ఫుల్ ట్రాక్స్ రికార్డ్ తో ఇప్పటికి కొనసాగుతున్న వాటిలో, వైజయంతీ మూవీస్ టాప్ లిస్ట్ లో ఉంటుంది. కల్కి 2898ఏడీ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ అందించారు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఆయన 50 ఏళ్ళ సినీ ప్రయాణం సందర్భంగా యాంకర్ ఝాన్సీకి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని అశ్వినీదత్ పంచుకున్నారు. నిర్మాతగా అశ్వినీదత్ సోలోగానే కాకుండా ఇతర ప్రొడ్యూసర్స్ తో కలిసి కూడా కొన్ని చిన్న సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నారు. అలా గీతా ఆర్ట్స్ తో కలిసి వైజయంతీ మూవీస్ 'పెళ్లి సందడి' సినిమా మొదటిగా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ విషయాలని అశ్వినీదత్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాఘవేంద్రరావుతో మొదటి నుంచి మంచి స్నేహం ఉండేదని, అతను ఎక్కడ ఉంటే అందరం అక్కడ కలుస్తూ ఉండేవాళ్లమని అన్నారు.
అలా రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, నేను ఓ సారి కలిసిన సందర్భంగా ఓ చిన్న సినిమా కలిసి చేద్దామనే ఐడియా వచ్చింది. అల్లు అరవింద్ తన ఆలోచనని మాతో పంచుకున్నారు. మేము కూడా దానికి అంగీకరించాం. స్టోరీ కూడా ఉందని చెప్పారు. రెండు రోజుల తర్వాత కథతో వచ్చారు. కథ బాగుండటంతో మూవీ స్టార్ట్ చేసాం. 1.20 కోట్లు ఆ సినిమాకి మొత్తం ఖర్చయ్యింది. రాఘవేంద్రరావు రెమ్యునరేషన్ కూడా అందులోనే ఉంది.
మూవీ రిలీజ్ తర్వాత 11.30 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఆ టైంలో పెళ్ళిసందడి సెన్సేషనల హిట్ గా నిలిచింది. పెట్టిన పెట్టుబడికి 10 రేట్లు అదనంగా కలెక్షన్స్ వచ్చాయని అశ్వినీదత్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పటికి పెళ్లి సందడి రాఘవేంద్రరావు బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఉంటుంది. అప్పటికి శ్రీకాంత్ కొత్త హీరో. పెళ్లి సందడి తర్వాత శ్రీకాంత్ కి సూపర్ ఫేమ్ వచ్చింది.