మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్
జాతీయ అవార్డు విజేత, నటుడు పంకజ్ త్రిపాఠి మరో ప్రయోగాత్మక పాత్రతో అలరించబోతన్నారు
జాతీయ అవార్డు విజేత, నటుడు పంకజ్ త్రిపాఠి మరో ప్రయోగాత్మక పాత్రతో అలరించబోతన్నారు. ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పాత్రతో అభిమానుల ముందుకు వస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. 'మైన్ అటల్ హూన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కొత్త పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. హార్ట్ ఆఫ్ గోల్డ్... ఉక్కు మనిషి... బహుముఖ కవి... నూతన భారతదేశం వెనుక దార్శనికుడు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి #MainATALHoon కథను 19 జనవరి 2024న సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్నాం! అని త్రిపాఠి రాశారు.
నటరంగ్ -బాలగంధర్వ వంటి జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలతో పాపులరైన దర్శకుడు రవి జాదవ్ ఉత్కర్ష్ నైతాని స్క్రిప్ట్ వర్క్ అందించారు. ఆయనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వినోద్ భానుశాలి, సందీప్ సింగ్, కమలేష్ భానుశాలి నిర్మించారు. భవేష్ భానుషాలి- సామ్ ఖాన్ ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. `మెయిన్ అటల్ హూన్` జనవరి 2024 విడుదలకు సిద్ధంగా ఉంది.
బయోపిక్ కేటగిరీలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల జీవితాలు వెండితెరకెక్కాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నవరసనటసార్వభౌముడు ఎన్టీఆర్, తలైవి జయలలిత జీవితకథలు వెండితెరకెక్కిన సంగతి తెలిసిందే. అమ్మ జయలలితపై ఒకటి కంటే ఎక్కువ బయోపిక్ లు రూపొందించారు.