ఆ మత్తు ఇంకా ఆయన్ని వదల్లేదా?
సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప జనాలు థియేటర్లకు వెళ్లడం లేదు. అలాంటిది రిలీజ్ కి ముందే 'బేబీజాన్' పై ఈ రకమైన ప్రచారం మరింత నెగిటివ్ గా మారుతుంది.
వరుణ్ ధావన్-కీర్తి సురేష్ జంటగా బాలీవుడ్ లో నటించిన 'బేబీజాన్' రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాత అట్లీ. అలాగే ఈ సినిమాకు కథ అందించింది కూడా అట్లీనే. 'తేరీ' సినిమా స్పూర్తితో ఈ కథ రాసారు. అయితే రిలీజ్ కి ముందే ఈ సినిమాపై ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. సినిమాలో తేరీ ప్లేవర్ ఉందనే విమర్శ వినిపిస్తుంది.
ఆ చిత్రంలా ఉందనే మాట వినిపిస్తుంది. యాక్షన్ డ్రామా అనుకున్నంతగా పండటం కష్టమనే మాట తెరపైకి వస్తుంది. ప్రచార చిత్రాల ద్వారా విడుదలైన సినిమాలో విజువల్స్ 'జవాన్' చిత్రంలోని జిందా బందా మాదిరిగా ఉన్నాయంటున్నారు. ఇటీవల విడుదలైన 'బందోబస్త్' పాట కూడా శ్రోతలకు అంతగా ఎక్కలేదంటున్నారు. ట్యూన్స్ కూడా కొత్తగా లేవంటున్నారు. మొత్తంగా అట్లీ తేరీ నుంచి పూర్తిగా బయటకు వచ్చి రాసిన కథలా లేదనే ఆరోపణ తెరపైకి వస్తుంది.
మొత్తంగా సినిమా రిలీజ్ కి ముందే ఓ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇదే కంటున్యూ అయితే ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుంది. రిలీజ్ లోపు ఆ నెగిటివిటినీ పాజిటివ్ గా మార్చుకోవాలి. సినిమా జనాల్లోకి వెళ్లాలంటే రిలీజ్ తర్వాత వచ్చే మౌత్ టాక్ తోనే సాధ్యమవుతుంది. అది చాలా బలంగా వెళ్తే తప్ప సాధ్యం కాదు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప జనాలు థియేటర్లకు వెళ్లడం లేదు. అలాంటిది రిలీజ్ కి ముందే 'బేబీజాన్' పై ఈ రకమైన ప్రచారం మరింత నెగిటివ్ గా మారుతుంది.
ఇప్పటికే ఈసినిమా 20 కోట్ల వరకూ ఓపెనింగ్స్ రూపంలో తీసుకు రావొచ్చని ఓ అంచనా తెరపైకి వచ్చింది. అది సినిమాకి పూర్తిగా పాజిటివ్ బజ్ ఉంటే? నెగిటివ్ బజ్ తో వెళ్తే అన్ని వసూళ్లు అసాధ్యం అనే అంటున్నారు. మరి ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితిని దాటి మేకర్స్ ఎలాంటి వ్యూహంతో ప్రేక్షకుల్లోకి వెళ్తారో చూడాలి.