మాస్ కి మీనింగ్ చెప్పేసిన నయా డైరెక్టర్!
అదే వేలో ట్రై చేసిన కొంత మంది కోలీవుడ్ మేకర్స్ ఫెయిలైనా అట్లీ కి మాత్రం ఇంత వరకూ వైఫల్యం ఎదురు కాలేదు.
కోలీవుడ్ సంచలనం అట్లీ గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలతో అట్లీ సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. అతడు తెరకెక్కించిన సినిమాలన్నీ కమర్శియల్ గా మంచి విజయాలు సాధించినవే. షారుక్ ఖాన్ తో 'జవాన్' తెరకె క్కించి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊచ కోత కోసాడు. అట్లీ ఎలాంటి సినిమాలు చేసినా కమర్శియల్ గా ఉంటాయి. మాస్ కి బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఇది అట్లీకి మాత్రమే చెల్లింది. అదే వేలో ట్రై చేసిన కొంత మంది కోలీవుడ్ మేకర్స్ ఫెయిలైనా అట్లీ కి మాత్రం ఇంత వరకూ వైఫల్యం ఎదురు కాలేదు.
అలాగని అట్లీ కథల్లో అద్బుతం ఏదైనా ఉంటుందా? అంటే అందుకు అవకాశమే ఉండదు. రోటీన్ కథనే తనదైన మాస్ కోణంలో ఆడియన్స్ కి ఎక్కించడంలో తానో స్పెషలిస్ట్. న్యూ ఏజ్ డైరెక్టర్లలో అట్లీ ని మాస్ కా బాప్ అనొచ్చు. మరి అట్లీ దృష్టిలో మాస్ కి మీనింగ్ ఏంటో తెలుసా? తొలిసారి మీనింగ్ చెప్పాడు.
అదెలాగో అట్లీ మాటల్లోనే.. 'మాస్ అంటే ఏలియన్ కాదు. తల్లి ఫీలింగ్ లాంటింది. అమ్మాయి కోసం ఏడిస్తే మాస్..భావోద్వేగం కోసం కన్నీరొస్తే మాస్.. బేబి కోసం కంట తడి పెడితే మాస్.. అవసరమైన సందర్భంలో కోపగించుకోవడం మాస్.. సరైన కారణం కోసం, సమాజం కోసం నిజంగా నిలబడితే అది మాస్. ఇవి కాకుండా మరో కోణంలో మాస్ అని పిలిస్తే అది మాస్ కాదు. ఈ కోణంలోనే నా సినిమాలుంటాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. ఇదే నా సక్సెస్ తారక మంత్రం ' అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక అట్లీ ఏడాదిన్నర కాలంగా కాళీగానే ఉంటున్నాడు. 'జవాన్' రిలీజ్ తర్వాత ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించ లేదు. ఇకపై తానే సినిమా చేసినా అది పాన్ ఇండియాలో సంచలనం అవ్వాలనే దిశగా అడుగులు వేస్తున్నాడు. అలాంటి స్టోరీలపైనే దృష్టి పెడుతున్నాడు. మరి అట్లీ 6 స్టోరీ అయిందా? లేదా? అన్నది తెలియాలి. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నట్లు కూడా కొంత కాలంగా ప్రచారంలో ఉంది. ఆ వివరాలపై వచ్చే ఏడాది క్లారిటీ వస్తుంది.