1000 కోట్ల డైరెక్టర్.. ఒకప్పుడు హీరో ఇంటి గేటు ముందు..

అలాగే అభిమాన హీరోతో సినిమా చేయాలని సంకల్పంతో మూవీస్ చేస్తోన్న దర్శకులు కూడా ఉన్నారు.

Update: 2024-02-29 13:30 GMT

సినిమాలని చూస్తూ, అందులో హీరోలు చేసే పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ కి ఫిదా అయిపోయి అభిమానులుగా వారి స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలా వచ్చి తమ అభిమాన హీరోతో సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు. అలాగే అభిమాన హీరోతో సినిమా చేయాలని సంకల్పంతో మూవీస్ చేస్తోన్న దర్శకులు కూడా ఉన్నారు.


అలాగే శంకర్, మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైంలో రాజారాణి సినిమాతో అట్లీ దర్శకుడిగా మారాడు. తరువాత వరుసగా విజయ్ తో కమర్షియల్ మూవీస్ చేసి సక్సెస్ లు అందుకున్నాడు. ఈ విజయాలు అతనికి ఏకంగా షారుఖ్ ఖాన్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందించాయి.

బాద్ షాకి జవాన్ మూవీతో సూపర్ హిట్ ఇవ్వడమే కాకుండా కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందించిన చిత్రాన్ని అట్లీ ఇచ్చాడు. ఇదే అట్లీ బాద్ షా అభిమానిగా కెరియర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో షారుఖ్ ఖాన్ ఇంటి గేటు ముందు నిలబడ్డాడు. రోబో షూట్ టైమ్ లో ముంబైకి వెళ్లగా అక్కడ షారుఖ్ ఖాన్ తో ఫోటో తీసుకోవడానికి ఆరాటపడ్డాడు. కానీ సాధ్యం కాలేదు. ఇంటి గేటు బయట ఫొటో తీసుకొని వచ్చాడు. తిప్పి కొడితే 14 ఏళ్ళలో అదే షారుఖ్ ఖాన్ ఇంటి గేటు అట్లీ కోసం ఓపెన్ అయ్యింది.

జవాన్ లాంటి కథని షారుఖ్ ఖాన్ విని సొంతం ప్రొడక్షన్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ అట్లీకి అవకాశం ఇచ్చాడు. అట్లీ ఆ అవకాశాన్ని కరెక్ట్ గా వినియోగించుకొని షారుఖ్ ఖాన్ ని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అట్లీ స్టోరీ బట్టి ఒకటి స్పష్టం అవుతుంది. సక్సెస్ అనేది ఆలస్యం అయిన దాని ఆహ్వానం మాత్రం గట్టిగా ఉంటుంది. అయితే అది వచ్చే వరకు మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ముందుకి వెళ్ళాలి.

ఇలాంటి సక్సెస్ లు చాలా మంది దర్శకులకి వచ్చాయి. మెగాస్టార్ సినిమాలు చూసి విజిల్స్ వేస్తూ, కాగితాలు ఎగరేసిన వాళ్ళు డైరెక్టర్స్ గా మారి అతనితో సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది టైం కచ్చితంగా ఇస్తుంది. దానికి ప్రయత్నం బలంగా ఉండాలి.


Full View


Tags:    

Similar News