అట్లీ.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు
ఈ మధ్యకాలంలో సౌత్ దర్శకులకి బాలీవుడ్ లో డిమాండ్ గట్టిగానే పెరుగుతోంది.
ఈ మధ్యకాలంలో సౌత్ దర్శకులకి బాలీవుడ్ లో డిమాండ్ గట్టిగానే పెరుగుతోంది. నార్త్ ఇండియన్ ప్రేక్షకులు మాస్ ఎలిమెంట్స్ తో ఉండే హీరోయిక్ ఎలివేషన్ కథలని చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ దర్శకులు అందరూ వెస్ట్రన్ టచ్ తో కథలు రాసి తెరకెక్కిస్తున్నారు. అవి పెద్దగా మెప్పించడం లేదు. దీంతో బాలీవుడ్ హీరోలు సౌత్ దర్శకుల మీద పడ్డారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ తో ఒక సినిమా చేస్తున్నారు.
అలాగే ఏఆర్ మురుగదాస్ తో కూడా ఒక మూవీ కమిట్ అయ్యారు. షారుఖ్ ఖాన్ గత ఏడాది అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా తర్వాత అట్లీకి బాలీవుడ్ లో డిమాండ్ పెరిగిపోయింది. స్టార్ హీరోలు కూడా అతని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ దర్శకులకి కూడా బాలీవుడ్ స్టార్స్ డేట్స్ ఇస్తున్నారు. అలాగే తెలుగులో స్టార్ హీరోల చిత్రాలలో నటించేందుకు ముందుకొస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అట్లీ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారంట. వరుసగా డిజాస్టర్ లు అందుకున్న సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సౌత్ దర్శకులతో వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. అలాగే అట్లీ చెప్పిన కథ కూడా నచ్చడంతో ఒకే చెప్పాడంట. అయితే ఈ కథని అట్లీ మల్టీ స్టారర్ గా చేయాలని అనుకుంటున్నాడంట. ఇందుకోసం తమిళ్ నుంచి కమల్ హాసన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.
కమల్ కు కూడా స్టోరీ లైన్ నచ్చడంతో ఒకే చేసారంట. ఇక ఫైనల్ నేరేషన్ కోసం కూడా ఈ ఇద్దరు హీరోలు వెయిట్ చేస్తున్నారంట. అన్ని అనుకూలంగా జరిగితే ఈ ఏడాదిలోనే మూవీ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉందనే టాక్ బిటౌన్ లో వినిపిస్తోంది. కమల్ హాసన్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ అంటే కచ్చితంగా అది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ అవుతుంది. అలాగే అన్ని భాషలలో క్రేజ్ వస్తుంది. ఇప్పటికే కమల్ హాసన్ విక్రమ్ తో హీరోగా కల్కితో విలన్ గా సక్సెస్ అందుకున్నారు.
మరోవైపు భారతీయుడు 2 రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ హిట్ అయితే అయన క్రేజ్ ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు అట్లీ దర్శకత్వంలో చేయబోయే మల్టీ స్టారర్ మూవీకి మంచి హైప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందనేది వేచి చూడాలి. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట. అలాగే యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రాన్ని అట్లీ రెడీ చేస్తున్నట్లు సమాచారం.