తారక్ గురించి వార్ 2 డైరెక్టర్ ఒపీనియన్ ఇదే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తో 3 రోజుల్లో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిచబోతున్నాడు.

Update: 2024-09-24 12:55 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తో 3 రోజుల్లో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిచబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కువగా బాలీవుడ్ మీద స్పెషల్ ఫోకస్ చేశాడు తారక్. ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ తో అక్కడ తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవరతో తన రేంజ్ ఏంటన్నది చూపించబోతున్నాడు. దేవర తో పాటుగా ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో కూడా భాగం అవుతున్నాడని తెలిసిందే. తారక్ కెరీర్ లో ఫస్ట్ టైం వార్ 2 కోసం డైరెక్ట్ హిందీ సినిమా చేస్తున్నాడు.

ఐతే వార్ 2 సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తారక్ గురించి ఏమనుకుంటారో కరణ్ జోహార్ వెల్లడించారు. దేవర, జిగ్రా కలిసి ప్రమోట్ చేసేలా ఎన్టీఆర్, అలియా భట్ తో కరణ్ జోహార్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. దానిలో వార్ 2 డైరెక్టర్ అయాన్ తారక్ గురించి చెప్పిన విషయాలను పంచుకున్నారు కరణ్ జోహార్. తారక్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాడని. ఇలా వస్తాడు.. తన పనిని సెకన్లలో కానిచ్చేసి వెళ్తాడని అయాన్ చెప్పాడని అన్నారు. అయాన్ తెలివైన వాడు తాను అనుకున్నది తీయాలని అనుకుంటాడు. చాలా దీర్ఘాలోచన ఉన్న వ్యక్తి. ఐతే తారక్ దానికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.

ఇక అలియా భట్ కూడా RRR లో ఎన్టీఆర్ నటించేప్పుడు తననే చూస్తూ ఎలా చేస్తున్నాడా అని అబ్సర్వ్ చేశానని అన్నారు. బ్రహ్మాస్త్ర టైం లో ఎన్టీఆర్ ఇంట్లోనే నైట్ డిన్నర్ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు అలియా భట్. దేవర సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పిన అలియా భట్ సినిమాలోని చుట్టమల్లె సాంగ్ ని హమ్ చేసింది.

దేవర సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన దేవర మొదటి భాగం మరో 3 రోజుల్లో రాబోతుంది. ఈ సినిమా మీద ఫ్యాన్స్ ఎంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Tags:    

Similar News