అయేషా పాప.. ఎద అందంతో స్టన్నింగ్..

టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటోంది ఆయేషా ఖాన్.

Update: 2024-06-26 04:51 GMT

బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో ఒక తెలుగు సినిమా చేసి.. మళ్లీ ఇటీవల ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకుంటోంది అమ్మడు. స్పెషల్ సాంగ్స్ తోపాటు సైడ్ క్యారెక్టర్లు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తోంది. తన అందం, అభినయంతో ఓ రేంజ్ లో కుర్రకారును ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటోంది ఆయేషా ఖాన్.


సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది ఆయేషా ఖాన్. కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటోంది. ట్రెండింగ్ సాంగ్స్ కు రీల్స్ చేస్తూ తెగ ట్రెండ్ అవుతుంటోంది. సోషల్ మెసేజెస్ కూడా ఇస్తుంటోంది. ఎక్కువగా శారీల్లో మెరుస్తుంటోంది. చీరల్లో వేరే లెవెల్ అందాలు ఆరబోస్తూ అందిరినీ ఫిదా చేస్తుంటోంది ఆయేషా.


రీసెంట్ గా కొత్త పిక్స్ షేర్ చేసింది బ్యూటీ. ఈసారి చీరలో కాకుండా.. మోడ్రన్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. గర్ల్స్ ఫేవరెట్ కలర్ అయిన బేబీ పింక్ కలర్ డ్రెస్ లో తళుక్కుమంది. ఫుల్ డిజైనింగ్ వర్క్ బ్లౌజ్ వేసుకున్న అమ్మడు.. ఓరగా చూస్తూ క్లీన్ బౌల్డ్ చేస్తోంది. సింపుల్ గా హెయిర్ లీవ్ చేసి కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది. క్రేజీ క్యాప్షన్ తో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం ఆయేష పిక్స్ నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి.

ఆయేషా ఖాన్ అందానికి ఎవరైనా ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అని నెటిజన్లు అంటున్నారు. బ్యూటీ సింపుల్ లుక్స్ కు ఫిదా అయ్యామని చెబుతున్నారు. క్యూట్ గా ఉంటూనే హీట్ పుట్టిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. అందానికి ఇమేజ్ అంటూ కుర్రాళ్ళు తెగ పొగిడేస్తున్నారు. అలా బ్యూటీని ఆకాశానికెత్తేస్తున్నారు. టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకుని దూసుకుపోవాలని అంతా ఆశిస్తున్నారు.

అయితే కొన్నేళ్ల క్రితం.. యంగ్ హీరో విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ లో నటించిన ముఖచిత్రం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆయేష ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైన అమ్మడు.. బిగ్ బాస్ హిందీ సీజన్-17తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఓం భీమ్ బుష్ మూవీతో అందరినీ ఆకట్టుకుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టేసింది. త్వరలోనే దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్ తో సందడి చేయనుంది. మరి ఈ బ్యూటీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News