యంగ్ హీరో న్యూడ్ అటెంప్ట్!

అత‌డు ఎవ‌రో కాదు యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. య‌శ్ రాజ్ ఫిలింస్ ఆయుష్మాన్ హీరోగా ఓ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తుంది. దీన్ని స‌మీర్ స‌క్సేనా తెర‌కెక్కిస్తున్నాడు.

Update: 2024-12-17 17:30 GMT

పాత్ర‌ను పండించే విష‌యంలో బాలీవుడ్ హీరోలు ఏమాత్రం వెనుక‌డుగు వేయ‌రు. ఎలాంటి స‌న్నివేశాల్లోనైనా నిర్మొహ మాటంగా న‌టించ‌డంలో ముందుంటారు. బాలీవుడ్ లో న్యూడ్ గా న‌టించిన హీరోలు, హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా న‌టుల విష‌యానికి వ‌స్తే? పీకే సినిమాలో? మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ సైతం న్యూడ్ గా కొన్ని స‌న్నివే శాల్లో న‌టించాడు. ఏలియ‌న్ రోల్ లో అచేధ‌నంగానే ఓ రేడియో అడ్డు పెట్టుకుని క‌నిపిస్తాడు. అలాగే ర‌ణ‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే.

దీనిపై దేశ వ్యాప్తంగా ఏకంగా తీవ్ర విమ‌ర్శ‌లే ఎదుర్కున్నాడు. ఇంకా గ‌తం త‌వ్వితే చాలా మంది చిట్టా బ‌య‌ట‌ ప‌డుతుంది. అయితే ఇప్పుడు వాళ్లంద‌ర్నీ మించి మ‌రో న‌టుడు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. ఏకంగా ఆ సినిమా క‌న్సెప్ట్ కంప్లీట్ బోల్డ్ గా ఉండ‌టంతో? హీరో సినిమా అరంభం నుంచి ముగింపు వ‌ర‌కూ న్యూడ్ గానే ప్ర‌తీ స‌న్నివే శంలో క‌నిపిస్తాడుట‌. ఇంత‌కీ ఏంటా సినిమా? అంత సాహసం చేస్తున్న హీరో ఎవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

అత‌డు ఎవ‌రో కాదు యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. య‌శ్ రాజ్ ఫిలింస్ ఆయుష్మాన్ హీరోగా ఓ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తుంది. దీన్ని స‌మీర్ స‌క్సేనా తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది ప్ర‌ధమార్ధంలో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతున్నారు. సినిమా క‌థ ప్రేక్ష‌కుడిని సీట్ అంచున కూర్చే బెట్టేలా ఉంటుందిట‌. ఎంతో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతుంద‌ని అంటున్నారు.

ఓవైపు భ‌య‌పెడుతూనూ మ‌రోవైపు క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ ట్రాక్ బ‌లంగా ఉంటుందిట‌. అందులో ఆయుష్మాన్ స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. న్యూడ్ స‌న్నివేశాలు మ‌రింత ఇంట్రెస్టింగ్ గా రాసుకున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. రొటీన్ కి భిన్న‌మైన పాత్ర‌ల‌తో మెప్పించ‌డం ఆయుష్మాన్ ప్ర‌త్యేక‌త‌. ఇలాంటి న్యూడ్ పాత్ర‌కు అంగీక‌రించాడు? అంటే అత‌డి ప్ర‌త్యేక‌త మ‌రోసారి నెట్టింట చ‌ర్చకొస్తుంది.

Tags:    

Similar News