బేబీ క్లైమాక్స్.. మెగాస్టార్ ఊహించని రియాక్షన్
ముఖ్యంగా బేబీ లీడ్ రోల్ చేసిన వైష్ణవి చైతన్యను సహజ నటి అంటూ పోల్చారు
బేబీ.. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ కి చాలా కాలం తర్వాత వచ్చిన హిట్ ఇది. అసలు ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. విరాజ్ మరో కీలక పాత్రలో నటించారు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న 'కలర్ ఫొటో' సినిమాకు కథ అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన సాయి రాజేష్ నీలం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కాగా, ఈ మూవిని చూసి టాలీవుడ్ సెలబ్రెటీలు అందరూ ఇంప్రెస్ అవతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ స్పెషల్ మీటింగ్ పెట్టి ప్రశంసలు కురిపించారు, రామ్ లాంటి యంగ్ హీరో స్పెషల్ గా విషెస్ చెప్పారు. ఇప్పుడు మెగాస్టార్ వంతు వచ్చింది. ఆయన కూడా ఈ మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మూవీలో నటించిన వారి దగ్గర నుంచి డైరెక్టర్ , ప్రొడ్యూసర్ ని ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ మరీ పొగిడారు.
ఇక, ముఖ్యంగా బేబీ లీడ్ రోల్ చేసిన వైష్ణవి చైతన్యను సహజ నటి అంటూ పోల్చారు. వైష్ణవి పాత్రలో చూపించిన వేరియేషన్స్ , ఆమె మేకోవర్ ఇలా స్పెషల్ పొగడటం విశేషం. ఆమె మంచి భవిష్యత్తు ఉందని కొనియాడారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ని ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న చిరు, మూవీలోని ఒక్కో సీన్ ని తీర్చిన విధానాన్ని వివరించడం విశేషం.
ఇక, ఆనంద్ దేవర కొండ నటనను కూడా ఆయన మెచ్చుకున్నారు. తన ప్రియురాలి గురించి నిజం తెలిసిన సందర్భంలో ఆనంద్ కనబరిచిన భావోద్వేగాలు చూసి అతనిలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా? అని ఆశ్చర్యపోయానన్నారు. ఇఖ విరాజ్ అశ్విన్ చక్కగా నటించారన్నారు. లవ్ స్టోరిస్ చాలా చూస్తుంటామని, కానీ ఈ సినిమాలో అందరూ మంచి వాళ్లే అని, విలన్ లేకుండా ఇంత బాగా చూపించగలిగారు అంటే సర్ ప్రైజ్ అయ్యాను అని చెప్పారు.
ఈ సినిమాని పిల్లల కన్నా ముందు తల్లిదండ్రులు చూడాలని ఆయన అన్నారు. టెక్నాలజీ మాయలోపడి పిల్లలు ఏవిధంగా చెడిపోతున్నారో? ఏ వయసులో వారిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఈ మూవీ చూసి వారు తెలుసుకోవాలి అని అన్నారు. ఇక, ఈ మూవీ క్లైమాక్స్ విషయంలో చిరు షాకింగ్ కామెంట్స్ చేశారు. మొదట ఈ మూవీ క్లైమాక్స్ మరోలా ఉంటే బాగుండేది అనిపించిందని, కానీ, తర్వాత డైరెక్టర్ సాయి రాజేష్ కథను చివరకు కన్విన్స్ చేసిన విధానం తనకు బాగా నచ్చిందని చెప్పారు.