పిక్ టాక్ : 'ఒక్కడు' ఆషా ఇప్పుడు ఇలా...!

మహేష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన 'ఒక్కడు' సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

Update: 2024-03-22 07:37 GMT

మహేష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన 'ఒక్కడు' సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ తర్వాత మంచి ఆఫర్లు వచ్చాయి. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో కెరీర్‌ లో సెట్‌ అయిన వారు ఉన్నారు.

ఒక్కడు లో మహేష్ బాబు చెల్లి ఆషా పాత్రలో బేబీ నిహారిక నటించింది. అంతకు ముందు ఆ తర్వాత చాలా సినిమాల్లో కూడా బేబీ నిహారిక నటించింది. కానీ ఒక్కడు తో వచ్చినంత పాపులారిటీ ఆమెకు మరే సినిమా తో రాలేదు అనడంలో సందేహం లేదు.

ఆ బేబీ నిహారిక ఇప్పుడు పెద్ద అమ్మాయి అయ్యింది. పెద్ద అవ్వడం మాత్రమే కాకుండా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. చైల్డ్‌ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసిన నిహారిక పెద్ద అయ్యాక ఆఫర్లు వచ్చినా కూడా తిరస్కరించి చదువు పై దృష్టి పెట్టి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది.

సినిమాలకు పూర్తి దూరం అయిన నిహారిక సోషల్‌ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు ఇలా తన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో నిహారిక ఫోటోలు బయటకు రాలేదు. కానీ గతంలో షేర్‌ చేసిన ఈ ఫోటోలను నెటిజన్స్ ఇప్పుడు షేర్ చేసి ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.

చిన్నప్పుడు బబ్లీగా అందంగా ఉన్న నిహారిక పెద్దయ్యాక కూడా చాలా అందంగా ఉంది. హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాకుండా అందంగా ఉన్నావు, ఎందుకు సినిమాల్లో ప్రయత్నించడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత అయినా మళ్లీ నిహారిక సినిమాల్లోకి వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News