రజనీను అలా చూసి షాక్ అయ్యాను.. అమితాబ్..

నిజజీవితంలో చాలా సామాన్యుడిలా జీవించే రజనీకాంత్ ఎన్నో సందర్భాలలో బస్సులు, పార్కులు దగ్గర మారువేషంలో తిరుగుతుంటారని టాక్.

Update: 2024-09-25 23:30 GMT

తమిళ్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగులో కూడా సుపరిచితుడే. ఇప్పటికి ఆయన సినిమాలకు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక వ్యక్తిగతంగా ఆయన ఎంత సింపుల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరో అయినప్పటికీ ఆయన ఎంతో సింపుల్ గా కనిపించడమే కాక ఎటువంటి హడావిడి లేకుండా ఉంటారు. నిజజీవితంలో చాలా సామాన్యుడిలా జీవించే రజనీకాంత్ ఎన్నో సందర్భాలలో బస్సులు, పార్కులు దగ్గర మారువేషంలో తిరుగుతుంటారని టాక్.

ఇది కేవలం వాళ్లు వీళ్లు చెప్పిన మాటలే కాదు ఎందరో సెలబ్రిటీ లో కూడా రజనీకాంత్ సింపిలిసిటీ గురించి మాట్లాడుతారు. అలా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఒకసారి రజనీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరోగా ఎదిగిన తొలి రోజుల్లో రజనీకాంత్ కేవలం తమిళ్లోనే కాకుండా కన్నడ, తెలుగు అలాగే హిందీలో కొన్ని సినిమాలు చేశారు.

అలాంటి సమయంలో ఒకసారి అమితాబ్ బచ్చన్ తో కలిసి రజనీకాంత్ సినిమాలో నటించారట. అప్పుడు రజనీకాంత్ ఎలా ఉండేవారు అనే విషయాన్ని అమితాబ్ బచ్చన్ వివరించారు.‘వెట్టేయన్’ మూవీలో అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ తో కలిసి నటిస్తున్నారు. 33 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ ఓకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు. తాజాగా జైలర్ చిత్రంతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన రజిని తిరిగి మరో క్రేజీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇటీవల ఈ చిత్రం ఆడియో లాంచ్ కు హాజరు కాలేకపోయినా అమితాబ్ బచ్చన్ తన వాయిస్ నోట్ ని పంపించారు. ఇదే వాయిస్ నాట్ ని ఆడియో లాంచ్ షోలో ప్లే చేశారు. ఇక ఇందులో రజినీకాంత్ తో ‘హమ్’ అనే చిత్రం చేసేటప్పుడు రజినీకాంత్ నేలపై పడుకునేవారని.. అది చూసి అప్పటివరకు ఏసీ వాహనంలో పడుకునే తాను కూడా వెహికల్ నుంచి బయటకు వచ్చానని చెప్పిన అమితాబ్ అందుకే రజినీకాంత్ స్టార్ కాదు..సూపర్ స్టార్ అని ప్రశంసించారు.

‘వెట్టేయన్’మూవీ అక్టోబర్ 10 న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మనసిలాయో సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. రజనీకాంత్ జైలర్ మూవీ కు సూపర్ సాంగ్స్ అందించిన అనిరుద్ ఈ సినిమా కోసం కూడా అద్భుతమైన సాంగ్స్ ని సమకూరుస్తున్నారు. అందుకే ఈ పాట కోసం ప్రముఖ దిగ్గజ సింగర్ మలేసియా వాసుదేవన్ గాత్రాన్ని ఏఐ టెక్నాలజీ సహాయంతో ఉపయోగించారు.

Tags:    

Similar News