బ్యాక్ టూ బ్యాక్ మెగా మూవీస్.. ఫ్యాన్స్ కు పండగే..
మెగా హీరోల సినిమాలు లైన్ గా థియేటర్స్ లోకి వస్తే ఫ్యాన్స్ కి అది చాలా పెద్ద సెలబ్రేషన్ అని చెప్పొచ్చు.
టాలీవుడ్ లో అత్యధిక మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. కరెక్ట్ గా లెక్క పెడితే 8 మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. వీరిలో ఏడుగురు మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టుకొని బిజీగా ఉన్నారు. మెగా హీరోల సినిమాలు వరుసగా థియేటర్స్ లోకి రావడం గతంలో ఒకసారి జరిగింది. మెగా హీరోల సినిమాలు లైన్ గా థియేటర్స్ లోకి వస్తే ఫ్యాన్స్ కి అది చాలా పెద్ద సెలబ్రేషన్ అని చెప్పొచ్చు.
అలాంటి మెగా సెలబ్రేషన్ మరల రాబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఈ సందడి మొదలు కాబోతోంది. వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది. ఈ సినిమాని నవంబర్ 14న రిలీజ్ చేయనున్నట్లు టీజర్ తో పాటు ప్రకటించారు. సినిమాపైన వరుణ్ తేజ్ చాలా నమ్మకంగా ఉన్నారు. క్యారెక్టరరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉంది.
నవంబర్ 14న ‘మట్కా’ చిత్రం ఐదు భాషలలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’ రాబోతోంది. డిసెంబర్ 6న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం రిలీజ్ అయిన మూడు వరాల తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకుల ముందుకి రావడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయిపొయింది. క్రిస్మస్ కానుకగా అయితే రిలీజ్ ఖాయం చేశారు. అయితే డేట్ డిసెంబర్ 20 ఉంటుందా లేదంటే 25 ఉంటుందా అనేది చూడాలి.
ఈ మూవీ రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మూవీ ‘విశ్వంభర’ థియేటర్స్ లోకి వస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోంది. జనవరి 10 సంక్రాంతి కానుకగా సందడి చేయబోతోంది. నలుగురు హీరోల నుంచి వస్తోన్న సినిమాలు పాన్ ఇండియా బ్రాండ్ తోనే ఏకంగా ఐదు ఇండియన్ భాషలలో రిలీజ్ కాబోతూ ఉండటం విశేషం.
ఈ లైన్ అప్ మెగా ఫ్యాన్స్ కి అయితే పెద్ద పండగ తీసుకొచ్చినట్లే అని చెప్పాలి. అన్ని సినిమాలపై ఫ్యాన్స్ లో ఎంతో కొంత బజ్ ఉంది. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాలో ప్రతి ఒక్కటి చూడటానికి ఆసక్తి చూపిస్తారు. మరి వీటిలో ఎన్ని బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.