ఫ్యామిలీతో ఆ సినిమా సాధ్యమేనా?
ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా `బ్యాడ్ న్యూజ్` థియేటర్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా `బ్యాడ్ న్యూజ్` థియేటర్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో నిండిన ఎంటర్ టైనర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో సినిమా బాక్సాపీస్ వద్ద 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. విక్కీ కౌశల్- త్రిప్తీ డిమ్రీ నటనతో రొమాంటిక్ పెర్పార్మెన్స్ తో జనాల్ని ఆకర్షించడంలో నూరు శాతం సక్సెస్ అయ్యారు.
ముఖ్యంగా త్రిప్తీ బ్యూటీ సినిమాకి అదనపు అస్సెట్ గా కలిసొచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె ప్రాతిపదికన (రూ.349)తో అందు బాటులో ఉంది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోవడం ఖాయమే. థియేటర్లో ఫెయిలైన సినిమాలే ఓటీటీలో ఆడేస్తున్నాయి.
ఇక హిట్ కంటెంట్‌కి ఇంకెలాంటి రెస్పాన్స్ ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. 349 రూపాయలకు కుటుంబమంతా ఒకే వేదికపై ఎంచక్కా ఆస్వాదించొచ్చు. అయితే కంటెంట కాస్త బోల్డ్ గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ అంతా ఒకే చోట కూర్చుని ఆస్వాదించడంలో కొన్ని రకాల ఇబ్బందులుంటాయి. వాటిని అధిగ మించగలిగితే ఎలాంటి సమస్య ఉండదు.
జీవితంలో ఎంతో సాధించాలని కలలు కనే అమ్మాయి అనుకోకుండా పెళ్లి చేసుకోవడం.. మరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం.. చివరికి వాళ్లిద్దరి కారణంగా తల్లి కావడం అనే క్యాప్షన్ తో ఆనంద్ తివారీ తెరకెక్కించారు. ఇద్దరు తండ్రులు ఈ సంఘటనను ఎలా స్వీకరించారు ? తమ బిడ్డ కోసం ఏం చేశారు అన్నది తెలియా లంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో నేహా ధూపియా కీలకపాత్ర పోషించింది.