పుండు మీద కారం జల్లినట్లు ఇలా దిగాడేంటి?
వరుస పరాభవాలతో బాలీవుడ్ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్స్ దివాళా తీసిన సంగతి తెలిసిందే.
వరుస పరాభవాలతో బాలీవుడ్ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్స్ దివాళా తీసిన సంగతి తెలిసిందే. ముంబైలో ఉన్న ఏడంతస్తుల కార్యాలయాన్ని అమ్మేసి కొన్ని అప్పులు తీర్చారు. ఇదంతా `బడేమియాన్ చోటే మియాన్` రిలీజ్ అనంతరం జరిగిన పరిణామం. దీంతో జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ తీవ్రమైన అప్పుల్లో మునిగిపోయారని అర్దమైంది. అప్పటికే అప్పుల్లో ఉన్న సంస్థ బడేమియాన్ హిట్ అయితే అన్ని లెక్కలు సరి చేయోచ్చని భావించారు.
దీనిలో భాగంగానే సినిమాని భారీ గా ఖర్చు తో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లను కూడా తేలేకపోయింది. ఇలా బడేమియాన్ చేటే మీయాన్ నిర్మాతలు తీవ్ర ఆర్దిక సంక్షోభంలో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో పుండు మీద కారం జల్లినట్లు ఆ చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ నాకు చెల్లించాల్సిన బకాయి 7.30 కోట్లు చెల్లించడంలో నిర్మాతలు విఫలమయ్యారనే ఆరోపణ తెరపైకి తెచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
ఆ సినిమాకు గాను నిర్మాతలు తనకు ఇవ్వాల్సిన పారితోషికం పూర్తి గా ఇవ్వనట్లు ఆరోపించారు. దీనికి సంబంధించిన అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (FWICE)ని సంప్రదించమని అసోసియేషన్ పేర్కొన్నట్లు సమాచారం. అయితే దీనిపై పూజా ఎంటర్ టైన్ మెంట్స్ స్పందించింది. అలీ అబ్బాస్ అరోపణల్నిఖండించింది. అతడు పేర్కొన్న బకాయిలేవి చట్టబద్దమైనవి కావని తెలిపింది. తాము అలీ అబ్బాస్ కి ఎలంటి బకాయిలు లేవమని వివరించే ప్రయత్నం చేసింది.
మరి దీనిపై అలీ అబ్బాస్ మీడియా ముందుకొచ్చి మాట్లాడితే తప్పక్లారిటీ రాదు. సాధారణంగా డైరెక్టర్ చేసిన సినిమా ప్లాప్ అయితే నిర్మాతను పారితోషికం అడిగే పరిస్థితి ఉండదు. కానీ బాలీవుడ్ లో కొందరు దర్శకుల తీరు అందుకు భిన్నంగా ఉంటుంది. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా కమిట్ మెంట్ ప్రకారం చెల్లించాల్సింది యధావిధిగా ఇచ్చుకోవాల్సిందే అన్న నానుడిని ప్రదర్శిస్తుంటారు.