టర్కీ వీధుల్లో కావ్య స్టైలిష్ లుక్

బలగం సినిమా ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపును అందుకున్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతోంది.

Update: 2024-11-10 15:16 GMT

బలగం సినిమా ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపును అందుకున్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతోంది. సోషల్ మీడియాలో అమ్మడికి ఇటీవల ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరుగుతోంది. ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా వెంటనే వైరల్ అవుతున్నాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటోలలో అమ్మడి మరింత అందంగా కనిపించింది.


టర్కీలోని ఇస్తాంబుల్ వీధుల్లో కావ్య కళ్యాణ్ రామ్ తన ట్రెండీ లుక్‌తో ఆకట్టుకుంటోంది. బ్లాక్ డ్రెస్, కోట్‌లో కనిపిస్తూ మరింత గ్లామర్ తో హైలైట్ అయ్యింది. ఈ ఫోటోల్లో ఆమె సింప్లిసిటీతో పాటు, మోడ్రన్ లుక్‌ లో స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఈ ఫోటోల్లో పాత స్ట్రీట్ ట్రామ్ పక్కన ఇచ్చిన పోజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేకంగా ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాలనే తన కోరికను మజాకా గానూ, ట్రెండీ గానూ అభిమానులతో పంచుకుంది.


"ఇస్తాంబుల్‌లో ఉన్న క్యాట్స్ కు అంకితం" అనే క్యాప్షన్‌తో కొన్ని పిల్లుల పోటోలను కూడా పోస్ట్ చేసింది. ఆమె కెరీర్ విషయానికి వస్తే, కావ్య ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటూ పలు ప్రాజెక్టుల్లో భాగమవుతోంది. "మసూద" మరియు "బలగం" వంటి విజయవంతమైన సినిమాలతో ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.


ఈ విజయాలు కావ్యకు మరింత క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి, దానికి తోడు ఆమె ఫోటోషూట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈరోజుల్లో కేవలం సినిమాల్లోనే కాకుండా, సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం సాధారణమైంది. కావ్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులను ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్‌లలో అలరిస్తూ తన ఫాలోయింగ్‌ని మరింతగా పెంచుకుంటోంది.


ప్రస్తుతం టర్కీలో అందమైన లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ ఫోటోలు ఆమె స్టైల్‌కి కొత్త డైమెన్షన్‌ ఇచ్చాయి. ఇలాగే, ఫ్యాషన్‌లో ట్రెండీగా ఉండడమే కాకుండా, సినిమాల్లో కూడా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ టాలెంటెడ్ బ్యూటీ మరిన్ని కొత్త ప్రాజెక్టులతో రాబోతోంది. మరి ఆ సినిమాలు ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

Tags:    

Similar News