BB4: అసలైన అప్డేట్ వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అంచనాలు కలిగిన కాంబినేషన్ అని చెప్పవచ్చు.

Update: 2024-10-12 06:13 GMT

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అంచనాలు కలిగిన కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాసి, ఆడియన్స్ కి మాస్ ఎంటర్‌టైనర్‌లుగా చిరస్థాయిగా గుర్తిండిపోయే సినిమాలుగా నిలిచాయి.


ఇప్పుడు, ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ #BB4 చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. 'లెజెండ్' చిత్రాన్ని నిర్మించిన రామ్ అచంట మరియు గోపి అచంట తమ 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గారు ఈ చిత్రాన్ని సమర్పించనున్నారు.

ఫైనల్ గా ఎప్పుడెప్పుడా మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అధికారికంగా గ్రాండ్ గా ప్రారంభించే తేదీని కూడా ప్రకటించారు. ఈ దసరా సందర్భంగా అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు ఈ భారీ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా వివరాలు, నటీనటులు, టెక్నీషియన్లపై మరిన్ని విశేషాలు తెలియజేయనున్నారు.

ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. టాప్-నాచ్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రం, బాలకృష్ణకు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అత్యంత ఖరీదైన సినిమాగా ఉండబోతుంది. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, కథలో సరికొత్త కోణం ఉంటుందని, దీనితో పాటు అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలను వినియోగిస్తూ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

'అఖండ' చిత్రంతో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో తెలుగు సినీ పరిశ్రమలో సెన్సేషనల్ హిట్ అందించింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాలకృష్ణ మార్కెట్‌ను మరింత స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు, ఆ హిట్ తర్వాత మళ్లీ బోయపాటి, బాలకృష్ణ కాంబోలో రాబోతున్న ఈ #BB4 సినిమా మరింత పెద్ద అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈసారి కూడా ఈ చిత్రం నందమూరి అభిమానులకు పండగను అందించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

దసరా పండగ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే, ఈ చిత్రంలో కూడా ఒక పవర్‌ఫుల్ కథాంశం ఉండబోతుందని అర్థమవుతోంది. పోస్టర్‌లో దుర్గామాత ఐకానిక్ లుక్ కనిపిస్తుంది, అది సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పోస్టర్, సినిమాకు సంబంధించిన అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇది బాలకృష్ణ కెరీర్‌లో మరొక సంచలన హిట్ గా నిలిచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రారంభోత్సవం జరగబోతోంది, మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి విజువల్ ఫీస్ట్ అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News