డాకు పాన్ ఇండియా మోత ఫిక్స్..!

నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ డాకు మహారాజ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మించారు

Update: 2025-01-07 09:30 GMT

నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ డాకు మహారాజ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతెల, శ్రద్ధ శ్రీనాథ్ నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ తో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడగా మొన్నటిదాకా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ అనుకున్న ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

రిలీజ్ వారం ముందు డాకు మహారాజ్ మేకర్స్ ప్లాన్ మార్చేశారు. సినిమా ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్ ఇది నేషనల్ లెవెల్ లో వర్క్ అవుట్ అయ్యేలా ఉందని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, హిందీ వెర్షన్ లు సిద్ధం చేస్తున్నారు. జనవరి 12న తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. డాకు మహరాజ్ నేషనల్ లెవెల్ లో రిలీజ్ అవ్వడం నందమూరి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.

సీనియర్ హీరోల్లో బాలకృష్ణ ఈమధ్య వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఆయన సినిమా అంటే చాలు రిజల్ట్ సూపర్ హిట్ అనేలా ఉంది. కథ ఏదైనా బాలయ్య యాక్షన్ మాత్రం మిస్ అవ్వదు. అసలు యాక్షన్ లేని బాలకృష్ణ సినిమాలు ఆడియన్స్ ఊహించలేరు. ఐతే మాస్ యాక్షన్ సినిమాలు తీయడంలో పట్టున్న బాబీ బాలయ్యతో డాకు మహారాజ్ సినిమా కూడా మాస్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించేలా తెరకెక్కించాడు. అందుకే సినిమా ఫైనల్ కాపీ చూసిన మేకర్స్ ఇది పాన్ ఇండియా రిలీజ్ చేసే బొమ్మ అని ఫిక్స్ అయ్యారు.

బాలకృష్ణ ఇప్పటివరకు పాన్ ఇండియా వైడ్ ఏ సినిమా రిలీజ్ చేయలేదు. అఖండ 2 ని అలా ప్లాన్ చేశారు. కానీ డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కు వారం ముందు సడెన్ గా తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే సినిమాకు తెలుగులో వస్తున్న బజ్ చూసి తమిళ్, హిందీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి డిమాండ్ ఏర్పడినట్టు ఉంది. అందుకే లాస్ట్ మినిట్ లో డాకు మహారాజ్ ని తమిళ్, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి తెలుగు నుంచి హిందీకి వెళ్తున్న స్టార్ సినిమాల్లో డాకు మహారాజ్ కూడా లైన్ లో ఉంది. మరి ఆ సినిమాతో బాలయ్య సినిమాకు బాలీవుడ్ ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారన్నది చూడాలి.

Tags:    

Similar News