బాలయ్య ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అంతే..!
శనివారం రాత్రి బాలయ్య తనలోని జోష్ ని ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించాడు.
నందమూరి బాలకృష్ణ ఎనర్జీ గురించి ఆయన స్టామినా గురించి ఎంత చెప్పినా తక్కువే. తెర మీద మాస్ హీరోగా కనిపించడమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా బాలకృష్ణ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. తెర మీద అయినా క్యారెక్టరైజేషన్ లిమిటేషన్స్ ఉంటాయేమో కానీ ఆఫ్ స్క్రీన్ అది ఉండదు. అందుకే బాలకృష్ణ ఎనర్జీ డబుల్ ట్రిపుల్ కనిపిస్తుంది. శనివారం రాత్రి బాలయ్య తనలోని జోష్ ని ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించాడు.
లేటెస్ట్ గా విజయవాడలో జరిగిన థమన్ ది యుఫోరియా మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో భాగంగా బాలకృష్ణ స్టేజ్ ఎక్కి దడదడలాడించేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ ఎనర్జీ అదిరిపోయింది. ఈవెంట్ లో భాగంగా బాలయ్య బాబు స్టేజి ఎక్కి పాట పాడటమే కాదు డ్రమ్స్ వాయించి అదరగొట్టేశారు.
ఎప్పటిలానే బాలకృష్ణ స్టేజ్ ఎక్కి తన సినిమాలో పాట పాడారు. సుగుణ సుందరి సాంగ్ ని ఆలపించి ఫ్యాన్స్ లో జోష్ నింపిన బాలయ్య బాబు ఆ పక్కనే శివమణి డ్రమ్స్ వాయిస్తుంటే వెళ్లి ఆయనతో కలిసి డ్రమ్స్ వాయించి ఫ్యాన్స్ లో హుశారు రెట్టింపు చేశాడు. ఈ ఈవెంట్ లో ఈ మూమెంట్ ని నందమూరి ఫ్యాన్స్ సూపర్ గా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. ఈవెంట్ ని సక్సెస్ చేయడంలో బాలయ్య తన వంతుగా సాంగ్ పాడటమే కాదు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా డ్రంస్ కూడా వాయించారు.
బాలకృష్ణ స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ఒకటే సందడి చేశారు. బాలయ్య ఎనర్జీ చూసిన చాలామంది ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఈవెంట్ ఏదైనా బాలకృష్ణ ఉన్నాడు అంటే అదిరిపోవాల్సిందే అనే రేంజ్ లో ఆయన జోరు కొనసాగిస్తారు. ది యూపోరియా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంలో థమన్ ట్రూప్ తో పాటు బాలకృష్ణ కూడా తన వంతు సహకారం అందించారని చెప్పొచ్చు. ఈ మ్యూజికల్ ఈవెంట్ లో థమన్ తన కంపోజిషన్ లో వచ్చిన అన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడి మ్యూజిక్ లవర్స్ ని అలరింపచేశారు. ఈవెంట్ లో పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఒకే ఫ్రేం లో కనిపించి సినీ లవర్స్ ని సూపర్ ఖుషి చేశారు.