బాలయ్యకి డబుల్ ఛాలెంజ్..?

నందమూరి నట సింహం బాలకృష్ణ సెంచరీ నుంచి సినిమా వెంట సినిమా చేస్తూ తన దూకుడు పెంచారు.

Update: 2024-09-06 20:30 GMT

నందమూరి నట సింహం బాలకృష్ణ సెంచరీ నుంచి సినిమా వెంట సినిమా చేస్తూ తన దూకుడు పెంచారు. యువ హీరోలకి ధీటుగా సినిమాల వేగాన్ని పెంచి అదరగొడుతున్నారు బాలయ్య. సినిమా రిజల్ట్ ఏదైనా సినిమా తర్వాత సినిమా చేసి ఇండస్ట్రీలో ఉన్న వారికి పని ఉండేలా చేస్తున్నారు. ఇక చేస్తున్న సినిమాల సక్సెస్ రేటు కూడా అదిరిపోతుంది. నందమూరి ఫ్యామిలీ హీరోగా బాలకృష్ణ ఇప్పటివరకు సోలోగా ఫ్యాన్స్ ని అలరిస్తూ వచ్చారు. ఇక ఆ ఫ్యామిలీ హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాలకు అవసరమైన టైం లో ప్రమోషన్స్ చేశారు.

ఐతే ఇప్పుడు బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తున్నాడు. నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారసుడి ఎంట్రీ ఫిక్స్ అయ్యింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా వైడ్ గా రాబోతుంది. ఐతే ఈ సినిమా విషయంలో బాలకృష్ణ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు తన సినిమాలేదో తనేదో అన్నట్టుగా ఉన్న బాలయ్య ఇప్పుడు తనయుడి సినిమాల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మోక్షజ్ఞ తనకు తానుగా కథల ఎంపిక చేసుకునే వరకు బాలకృష్ణ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

మోక్షజ్ఞ హీరోగా సక్సెస్ లు కొట్టే వరకు బాలకృష్ణ కచ్చితంగా డబుల్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. మోక్షజ్ఞ తొలి సినిమాకే భారీ ప్లాన్ చేసిన బాలయ్య అతని కెరీర్ మీద కూడా పూర్తి ఫోకస్ తో ఉంటారని చెప్పొచ్చు. ఐతే కొన్నాళ్ల వరకు ఓకే కానీ ఆ తర్వాత నీ కథలను నువ్వే సెలెక్ట్ చేసుకో అనే టైం కూడా వస్తుంది. ఆలోగా మోక్షజ్ఞ మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది. మోక్షజ్ఞ తొలి సినిమా ప్రకటన రాగానే అటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు తమ్ముడికి గ్రాండ్ వెల్కం చెబుతూ ట్వీట్ చేశారు.

నందమూరి ఫ్యామిలీ నుంచి నట వారసుడు వచ్చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో తొలి సినిమా చేస్తున్నారు కాబట్టి సినిమా రిజల్ట్ విషయంలో డౌట్ పడాల్సిన పని లేదు. ఐతే ఈ సినిమాలో బాలయ్య బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎలాంటి నిజం ఉంది అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News