భగవంత్ కేసరి.. అసలు బలం అదే..

మలయాళ ఇండస్ట్రీ మినహా.. ఒక స్టార్ ఇమేజ్​ ఉన్న హీరో... వయసుకు తగ్గ పాత్రలో నేచురాలిటీ ఉన్న మంచి కథల్లో నటించడం చాాలా అరుదుగా జరుగుతుంటుంది

Update: 2023-10-20 08:00 GMT

మలయాళ ఇండస్ట్రీ మినహా.. ఒక స్టార్ ఇమేజ్​ ఉన్న హీరో... వయసుకు తగ్గ పాత్రలో నేచురాలిటీ ఉన్న మంచి కథల్లో నటించడం చాాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ల కథల్లో పక్కాగా కమర్షియల్​ ఎలిమెంట్స్​ ఉండాల్సిందే. అవన్నీ హీరో సెంట్రిక్​గా.. హీరోను హీరో పాత్రను ఎలివేషన్​ చేస్తూ నడుస్తాయి.

అయితే ఇప్పుడు అన్నీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు వయసుకు తగ్గ పాత్రల్లో, ముఖ్యంగా కథలే హీరోగా నడిచే సినిమాల్లో కనువిందు చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కమల్​హాసన్, రజనీకాంత్​ ఈ మధ్యే దీన్ని ఫాలో అవుతుండగా.. ఇప్పుడు బాలయ్య కూడా అదే రూట్​ను సెలెక్ట్ చేసుకున్నారు. తాజాగా ఆయన నటించిన భగవంత్ కేసరి అక్టోబర్ 19 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్​ రావిపూడి బాగా హ్యాండిల్​ చేశారు.

ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్​కు కావాల్సిన ​ ఎలిమెంట్స్​ను చూపిస్తూనే​ కథకు పెద్ద పీట వేశారు. కేసరి క్యారెక్టరైజేషన్ సినిమాలో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. బాలయ్య(భగవంత్ కేసరి).. శ్రీలీల(విజ్జిపాప) మధ్య తిరిగిన ఎమోషనల్ బాండింగ్​ కథ మంచిగా వర్కౌట్​ అయింది. అనిల్​ కథను మంచిగా రాసుకుని ఫైనల్​గా​ సాలిడ్ మెసేజ్ ఇచ్చారు. తన కథకు న్యాయం చేశారు అనిపించింది. కమర్షియల్​ ఎలిమెంట్స్ మీద ఓవర్​ ఫోకస్ చేయకుండా కథను నేచురల్​గా ముందుకు నడిపించారు.

శ్రీలీలను గ్లామర్​గా చూపించకుండా కథకు తగ్గట్టు.. సినిమా మొత్తం డీ గ్లామర్​ రోల్​లోనే ఆమె పాత్రకు తగ్గట్టు చూపించారు. అనవసరమైన పాటలు కూడా పెట్టలేదు. అలానే సినిమాలో.. మంగమ్మ గారి మనవడు చిత్రంలోని దంచవే మేనత్త కూతురా పాట ఉంటుందని ప్రచారం సాగిన విషయం తెలిసిందే.

ఆ పాటను ఎక్కడా బలవంతంగా ఇరికించలేదు. స్టోరీలో నుంచి ఆడియెన్స్ డైవర్ట్ అవ్వకుండా ఉండేందుకు దాన్నీ షూట్​ చేసి కూడా పెట్టలేదు. తమన్ బ్యాక్​గ్రౌండ్ స్కోర్​ మ్యూజిక్​ కూడా సినిమాను బాగా ఎలివేట్ చేసింది. సాంగ్స్​తో తమన్ కాస్త​ నిరాశపరిచినప్పటికీ.. బీజీఎంతో దాన్ని బ్యాలెన్స్ చేశారు. మొత్తంగా ఇది.. అటు బాలయ్య ఇటు అనిల్ రావిపూడి మార్క్​ సినిమాలా కాకుండా ఓ మంచి సందేశం ఉన్న కథలా చక్కగా తీర్చిదిద్దాదరు. ఈ దసరాకు అటు ఫ్యామిలీ ఆడియెన్స్​ను ఇటు మాస్ ప్రేక్షకులకు కనెక్ట్​ అయ్యేలా బొనాంజ ఇచ్చారు.

Tags:    

Similar News