బాలకృష్ణ కొత్తగా.. చిరంజీవి రొటీన్ గా.. ఎందుకిలా..?

ఆల్రెడీ ఈ ఇయర్ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్యగా.. బాలకృష్ణ వీర సింహా రెడ్డిగా వచ్చి సక్సెస్ అందుకున్నారు

Update: 2023-08-11 08:25 GMT

టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి వెంకటేష్ సినిమాల విషయంలో దూకుడు చూపిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఇయర్ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్యగా.. బాలకృష్ణ వీర సింహా రెడ్డిగా వచ్చి సక్సెస్ అందుకున్నారు. రెండు సినిమాలు ఒక రోజు తేడాతో వచ్చి ఆడియన్స్ ని అలరించాయి. సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ సినిమాలు రెండు సూపర్ హిట్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత చిరు భోళా శంకర్, బాలయ్య భగవంత్ కేసరి సినిమాలు చేశారు.

భోళా శంకర్ సినిమా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కింది. తమిళ సినిమా వేదాళం సినిమాను రీమేక్ చేస్తూ చిరు చేసిన ఈ ప్రయత్నం అంతగా మెప్పించలేదు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ని కొన్ని పోర్షన్స్ లో సాటిస్ఫై చేసినా ఆడియన్స్ మాత్రం సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు. మెహర్ రమేష్ కి చిరు ఇచ్చిన ఛాన్స్ ని మిస్ యూజ్ చేసుకున్నాడని తెలుస్తుంది. అయితే చిరు ఈ సినిమానే కాదు ఈ మధ్య కథల విషయంలో చాలా కన్ ఫ్యూజ్ గా ఉన్నారు.

వాల్తేరు వీరయ్య ముందు వచ్చిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు కూడా చిరుకి నిరాశ మిగిలిచాయి. చిరంజీవి సినిమా అంటే మెగా ఫ్యాన్స్ లో ఒకరమైన జోష్ వస్తుంది కానీ సినిమా కథల్లో కొత్తదనం లేకపోవడం.. చిరు క్యారెక్టరైజేషన్ లో కొత్తదనం లేకపోవడం వల్ల సినిమాలన్నీ నిరాశపరచేలా చేస్తున్నాయి. భోళా శంకర్ లో చిరంజీవి మార్క్ కనిపించేలా చేసినా మిగతా యాస్పెక్ట్స్ అన్నీ సినిమాకు దెబ్బ వేశాయి.

ఇక మరోపక్క బాలకృష్ణ మాత్రం కొత్త కథలతో కొత్త క్యారెక్టరైజేషన్ తో వస్తున్నారు. అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కూడా బాలకృష్ణ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో కనిపించనున్నారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో హిట్ అందుకున్న బాలయ్య బాబు భగవంత్ కేసరితో హ్యాట్రిక్ షురూ చేయాలని చూస్తున్నారు.

కథల విషయంలో క్యారెక్టరైజేషన్ విషయంలో ఎందుకో చిరంజీవి రొటీన్ గా అనిపిస్తుంటే బాలకృష్ణ మాత్రం కొత్త పాత్రలతో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. చిరు తను చేయబోయే నెక్స్ట్ సినిమాల్లో ఈ విషయంలో జాగ్రత్త పడితే బెటర్ అని కోరుతున్నారు మెగా ఫ్యాన్స్. భోళా శంకర్ రిజల్ట్ తెలిసిపోయింది చిరు తర్వాత చేసే సినిమాల విషయంలో త్వరలో అనౌన్స్ మెంట్ రానుంది.

Tags:    

Similar News