రాజకీయం+ సినిమా ఆయనకే చెల్లింది!
రాజకీయాలు+ సినిమాలు బ్యాలెన్స్ చేయడం అన్నది అంత వీజీ కాదు. అది కొందరికే మాత్రమే సాధ్యం
రాజకీయాలు+ సినిమాలు బ్యాలెన్స్ చేయడం అన్నది అంత వీజీ కాదు. అది కొందరికే మాత్రమే సాధ్యం. సినిమా షూటింగ్ లు చేస్తూ రాజకీయ సమావేశాలు..క్యాపెనింగ్ లలో పాల్గొనడం అన్నది అత్యంత ప్రయాశతో కూడుకున్న పని. అలా ముందుకు సాగాలంటే ఎంతో కమిట్ మెంట్ డెడికేషన్ ఉండాలి. ఈ విషయంలో నటసింహం బాలకృష్ణ ముందున్నారు? అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాలయ్య ఓపు సినిమాలు చేస్తూనే సీరియస్ గా టీడీపీ పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మరోవైపు హిందుపురం ఎమ్యేల్యేగా బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇదే పార్టీతో కలిసి పనిచేస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమయం కేటాయించలేకపోతున్నా బాలయ్య మాత్రం దూకుడు చూపిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బాబి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇది ఎన్నికల సమయం అని తెలిసి కూడా బాలయ్య ఈ సినిమా పట్టాలెక్కించారు. ఈ విషయంలో తనకంటూ ఓ ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తున్నారు. మరోవైపు టీవీ ప్రోగ్రామ్ లకు హోస్ట్ గాను వ్యవహరిస్తున్నారు. అలాగే కొత్త ప్రాజెక్ట్ ల్ని లైన్ లో పెడుతున్నారు.సెట్స్ లో ఉన్న సినిమా పూర్తికాగానే గ్యాప్ లేకుండా కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని అండర్ కరెంట్ గా బాలయ్య మైండ్ లో రన్ అవుతుంటుంది.
దానికి తగ్గట్టు బాలయ్య టీమ్ పనిచేస్తుంటుంది. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవహరాలు కూడా బాలయ్య స్వయంగా చూసుకుంటారు. ప్రభుత్వాలతో మాట్లాడి పెండింగ్ బకాయిల్ని క్లియర్ చేయించుకోవడం వంటి పనులు ఆయనే చూస్తారు. ప్రస్తుతం పొత్తుతో ముందుకెళ్తున్న టీడీపీ పార్టీ కోసం బాలయ్య ఎంతలా శ్రమిస్తున్నారో కనిపిస్తూనే ఉంది. ఎన్నికలు దగ్గర పడటంతో బాలయ్య కూడా ప్రచారం కోసం సిద్దమవుతున్నారు. ఈ రెండు నెలలు పాటు పూర్తిగా రాజకీయాల్లోనే బిజీ బిజీగా ఉంటారు.