బాలయ్య - వెంకీ - చరణ్.. ఇది రెండోసారి!

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ జనవరి 10న థియేటర్స్ లోకి వస్తోంది. బాలకృష్ణ జనవరి 12న 'డాకు మహారాజ్' తో రాబోతున్నారు. జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో విక్టరీ వెంకటేష్ థియేటర్స్ లోకి వస్తున్నారు.

Update: 2025-01-06 12:17 GMT

ఈ సంక్రాంతికి 'గేమ్ చేంజర్' మూవీ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'డాకు మహారాజ్' చిత్రంతో నందమూరి బాలకృష్ణ, 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకుల ముందుకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ మూడు సినిమాలపైన అంచనాలు భారీగానే ఉన్నాయి. 'గేమ్ చేంజర్' ట్రైలర్ రిలీజ్ తర్వాత హైప్ పెరిగింది. 'డాకు మహారాజ్' వైబ్ కూడా పాజిటివ్ గానే నడుస్తోంది.

ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఫెస్టివల్ మూడ్ ని ఇప్పటికే తీసుకొచ్చేసింది. వీటిలో ఏ సినిమా ప్రేక్షకులని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే 2019లో కూడా ఇదే హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. 'ఆర్ఆర్ఆర్' కి ముందు రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో 'వినయ విధేయ రామా' సినిమా చేశారు. ఈ సినిమా జనవరి 11న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

ఇక బాలయ్య 'కథానాయకుడు' సినిమాతో జనవరి 9న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అలాగే విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఎఫ్ 2' మూవీ జనవరి 12 న రిలీజ్ అయ్యింది. ఈ మూడింటిలో 'ఎఫ్ 2' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. మిగిలిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ ఏడాది ఈ ముగ్గురు హీరోలు మరోసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు.

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ జనవరి 10న థియేటర్స్ లోకి వస్తోంది. బాలకృష్ణ జనవరి 12న 'డాకు మహారాజ్' తో రాబోతున్నారు. జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో విక్టరీ వెంకటేష్ థియేటర్స్ లోకి వస్తున్నారు. ఈ మూడు సినిమాలలో రెండింటిని దిల్ రాజు నిర్మించారు. ఇక 'డాకు మహారాజ్' సినిమా నైజాం రైట్స్ ని దిల్ రాజు దక్కించుకున్నారు.

ఈ నేపథ్యంలో దిల్ రాజుకి ఈ మూడు సినిమాల సక్సెస్ లు చాలా అవసరం అని చెప్పాలి. మరి వీటిలో ఏది ఈ ఏడాది బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' లాంటి సక్సెస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ స్టామినా ఎంత ఉందనేది 'గేమ్ చేంజర్' చిత్రంతో ప్రూవ్ చేసుకోబోతున్నాడు.

హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీద ఉన్న బాలయ్య 'డాకు మహారాజ్' తో తన బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచుకోవాలని అనుకుంటున్నారు. 'ఎఫ్2', 'ఎఫ్3'లతో రెండు హిట్స్ అందుకున్న వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ సక్సెస్ ని అందుకోవాలని భావిస్తున్నారు. మరి వీటిలో ఆడియన్స్ పట్టం కట్టేది దేనికో చూడాలి.

Tags:    

Similar News