బాలయ్య డబుల్ హ్యాట్రిక్ @రూ.150 కోట్లు
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి డబుల్ హ్యాట్రిక్ కోసం గట్టిగానే ప్రయత్నించబోతున్నాడు.
గత రెండు నెలలుగా ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కారణంగా బిజీ బిజీగా గడిపిన బాలయ్య ఎట్టకేలకు కాస్త రిలాక్స్ అయ్యాడు. ఎన్నికల హడావుడి పూర్తి కావడంతో రెండు మూడు రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ బాలయ్య షూటింగ్ కు హాజరు అయ్యాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సెట్స్ లో బాలయ్య సందడి చేస్తున్నారు.
చాలా రోజులుగా ఈ సినిమా ను వాయిదా వేస్తూ వస్తున్నారు. బాబీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేయాలని భావించినా కూడా బాలకృష్ణ డేట్లు ఇవ్వక పోవడంతో ఆలస్యం అయ్యింది. జూన్ లేదా జులై వరకు బాలయ్య - బాబీ సినిమా మొత్తం షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరీ ఆలస్యం చేయకుండా ఇదే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
బాబీ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బోయపాటి సినిమా షూటింగ్ ను బాలకృష్ణ మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. సింహా, లెజెండ్, అఖండ వంటి మూడు బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత ఈ సినిమాను చేయబోతున్న ఈ కాంబో మరో బ్లాక్ బస్టర్ ను దక్కించుకోవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ మూవీని 14 రీల్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఈ సినిమా నిర్మాణంలో కొత్తగా జాయిన్ అయ్యారు అనేది సమాచారం.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి డబుల్ హ్యాట్రిక్ కోసం గట్టిగానే ప్రయత్నించబోతున్నాడు. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లో ఖర్చు చేయని మొత్తంను ఈ సినిమా కోసం ఖర్చు చేయబోతున్నారట.
దాదాపుగా రూ.150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందబోతుంది. షూటింగ్ ప్రారంభంకు ముందే రూ.150 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. షూటింగ్ ప్రారంభం అయ్యి, మేకింగ్ లో ఎలాంటి రాజీ లేకుండా తీస్తే ఈ బడ్జెట్ రూ.200 కోట్లకు చేరిన ఆశ్చర్యం లేదు అనే టాక్ కూడా ఉంది. వీరి కాంబోలో రూపొందబోతున్న సినిమా అఖండ 2 అని, వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత సినిమా విడుదల ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.