బాలయ్య, శ్రీలీల మాస్ జాతరకు రెడీ
గణేష్ ఆంథమ్ ను సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. ఈ పాటలో బాలకృష్ణ తో పాటు శ్రీలీల డాన్స్ తో కుమ్మేయబోతుంది.
నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యం లో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమా పై అంచనాలు భారీగా ఉన్న విషయం తెల్సిందే. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా సందడి షురూ చేసేందుకు మొదటి పాట రాబోతుంది.
గణేష్ ఆంథమ్ ను సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. ఈ పాటలో బాలకృష్ణ తో పాటు శ్రీలీల డాన్స్ తో కుమ్మేయబోతుంది. సాధారణంగానే శ్రీలీల డాన్స్ స్టెప్స్ కి మాస్ ఆడియన్స్ ఫిదా అవుతారు. అలాంటిది బాలయ్య తో కలిసి శ్రీ లీల డాన్స్ చేస్తే మాస్ ఈ పాటను ఏ స్థాయి లో అలరించేనో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా లో బాలయ్య మరియు శ్రీ లీల తండ్రి కూతురుగా కనిపించబోతున్నారు. ఇద్దరి కాంబో సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాలను అలరిస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ సినిమా స్థాయిని పెంచాయి అనడంలో సందేహం లేదు. యాక్షన్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
తాజాగా మొదటి పాట విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటిస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలకృష్ణ మరియు శ్రీ లీల లు కాషాయం డ్రెస్ లో డాన్స్ స్టెప్ లో కనిపించడం చూసి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. పోస్టర్ ను చూస్తూ ఉంటే పాట ను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆసక్తిగా ఉందని అంటున్నారు.
ఇప్పటికే టీజర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మంచి మార్కులు పడ్డాయి. కనుక ఈ పాట తో తన స్థాయిని మరోసారి నిరూపించుకునేందుకు గాను థమన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య కు ఈ మధ్య పవర్ ఫుల్ మ్యూజిక్ ఇవ్వడం లో థమన్ సక్సెస్ అవుతున్నాడు. ఈసారి వినాయక చవితి మండపాల వద్ద భగవంత్ కేసరి పాట కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది.