సుప్రీత గ్లామర్ ట్రీట్.. ఇంకాస్త కొత్తగా..

తెలుగు సినిమాల్లో సురేఖా వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే

Update: 2024-07-02 13:30 GMT

తెలుగు సినిమాల్లో సురేఖా వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సహాయ నటిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె, ముఖ్యంగా బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్స్ జోడిగా నటిస్తూ మెరుగైన గుర్తింపు సంపాదించారు. సినిమాల్లో మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా సురేఖా వాణి ఎప్పటికప్పుడు తన అందంతో ఆకట్టుకుంటుంది.

సురేఖా వాణి కూతురు సుప్రీత ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. సురేఖా, సుప్రీతను పక్కపక్కన చూస్తే తల్లీకూతుళ్లు కాకుండా అక్కాచెల్లెళ్ల లా కనిపిస్తారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే సందడి చూసి అభిమానులు మురిసిపోతుంటారు. వీళ్లిద్దరూ తరచూ వెకేషన్లకు వెళ్లి, డిన్నర్ పార్టీల్లో చిల్డ్ అవుతుంటారు.

వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తమ ఫాలోవర్స్ తో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు. సుప్రీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతోంది. ఆమె త్వరలోనే హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టనుంది. ప్రస్తుతం ఆమె డెబ్యూ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ లోని ఫస్ట్ లుక్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు సుప్రీత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ, తన ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. తాజాగా సుప్రీత తన తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెకేషన్ లో ఉన్న సుప్రీత తన గ్లామర్ ఫోటోలతో నెట్టింట్లో హీట్ పెంచింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న అమ్మడు బ్లాక్ కలర్ లవ్ ఎమోజీ క్యాప్షన్ తో ఫోటోలను షేర్ చేసింది.

Read more!

ఎద అందాలతో కవ్విస్తూ, తన పోజులతో సెగలు రేపింది. ఈ ఫోటోలలో సుప్రీత లుక్స్ తో అభిమానులను మాయ చేస్తోంది. సుప్రీత తాజా ఫోటోలు చూసి నెటిజన్లు ఫ్లాట్ అయ్యారనే కామెంట్స్ పెడుతున్నారు. 'పెర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కలర్ ఫుల్ డ్రెస్ లో నవ్వుతో కుర్రాళ్లను పడేస్తుందని అంటున్నారు. ఇక సుప్రీత డెబ్యూ మూవీతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు. సురేఖా వాణి తర్వాత ఆమె కూతురు సుప్రీత కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అడుగులు వేస్తోంది. మరి ఆ రూట్లో అమ్మడు సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News

eac