బండ్లకు ఛాన్స్ పరోక్ష కారకుడు గురూజీనా?
ఈ సినిమా బండ్ల గణేష్ కి ఇవ్వడం వెనుక ఆయన కూడా ఓ కారణంగా కనిపిస్తున్నాడు. తొలుత ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్లో నిర్మించాలనుకున్నారుట.
పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. 'జల్సా' నుంచి మొదలైన వారిద్దరి ప్రయాణం కొనసాగుతుంది. కాల క్రమంలో ఇద్దరు కలిసి సినిమాలు చేయడం పెరిగింది. దీంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఇక ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేసినా త్రివిక్రమ్ సలహా తీసుకోకుండా చేయడం లేదనే వాదన కొంత కాలంగా వినిపిస్తుంది.
రీమేక్ సినిమా లైనా..స్ట్రెయిట్ సినిమాలైనా? గురూజీ సూచనలు, సలహాలతోనే చేస్తున్నారని వినిపి స్తుంది. అయితే ఇది ఇప్పటి నుంచి కాదు. 'గబ్బర్ సింగ్' నుంచే ఈ రకమైన ఒరవడి మొదలైనట్తు తాజాగా నిర్మాత బండ్ల గణేష్ మాటల్ని బట్టి తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా వెనుక కూడా గురూజీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా బండ్ల గణేష్ కి ఇవ్వడం వెనుక ఆయన కూడా ఓ కారణంగా కనిపిస్తున్నాడు. తొలుత ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్లో నిర్మించాలనుకున్నారుట. ఎలాగూ దర్శకుడు హరీష్ శంకర్ ఫిక్స్ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఒక రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ బండ్ల గణేష్ ని పిలిచి ఇది నువ్వే ప్రొడ్యూసర్ గా చేసుకోమని ఛాన్స్ ఇచ్చారుట. అయితే అప్పటికే గణేష్ పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ చేసి నష్టాలు పాలు అయ్యాడు.
దీంతో పవన్ మరో ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు. కానీ ఇంత వేగంగా ఇస్తాడని అతను అనుకోలేదు. ఆ సమయంలో గురూజీ కూడా గణేష్ కి సపోర్ట్ గా నిలిచినట్లు కనిపిస్తుంది. ఏదో సమయంలో త్రివిక్రమ్ విషయంలో గణేష్ నోరు జారడం... ఆతర్వాత సారీ చెప్పడం జరిగింది. తాజాగా అదే సన్నివేశాన్ని గుర్తు చేసుకుని గణేష్ బాగా ఫీలైనట్లు కనిపించాడు.