బాపు మరో 'బలగం' అవుతుందా..?

బలగం సినిమా తర్వాత అలా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా చాలా సినిమాలు వస్తున్నాయి.

Update: 2025-01-28 11:52 GMT

సినిమా సక్సెస్ కు స్టార్ కాస్ట్ అవసరం లేదని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈమధ్య కాలంలో అలా అసలు స్టార్స్ లేకుండా కేవలం రాసుకున్న కథను ఎమోషన్స్ తో నింపు సూపర్ హిట్ అందుకున్నాడు వేణు యెల్దండి. అతను తీసిన బలగం సినిమా అలాంటి సినిమాలు చేసే వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. బలగం సినిమా తర్వాత అలా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా చాలా సినిమాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా అలాంటి మరో సినిమా వస్తుంది. అదే బాపు. బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలుగా చేస్తున్నారు.


ఈ సినిమాను దయ డైరెక్ట్ చేయగా కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో రాజు, భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాపు సినిమా టీజర్ ను పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రిలీజ్ చేసింది. డార్క్ కామెడీ డ్రామాగా మంచి ఎమోషనల్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కించారని తెలుస్తుంది. టీజర్ చూస్తేనే సినిమాలోని ఎమోషనల్ అప్పీల్ తెలుస్తుంది.

ఫ్యామిలీ కథలు తక్కువ అవుతున్నాయని అనుకుంటున్న ఈ టైం లో కొన్ని సినిమాలు ఇచ్చిన ప్రోత్సాహంతో బాపు సినిమా వస్తుంది. ఈ సినిమా టీజర్ తోనే సినిమాపై ఒక పాజిటివ్ ఫీల్ వచ్చేలా చేశారు. బ్రహ్మాజి ఇలా సీరియస్ రోల్ చేసి చాలా రోజులు అవుతుందని చెప్పొచ్చు. సినిమాలో ప్రధాన పాత్ర దారుల మధ్యనే కథ, కథనం ఉంటుందని అర్థమవుతుంది.

బాపు టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక సినిమా ఎలా ప్రేక్షకులను అలరిస్తుంది అన్నది చూడాలి. ఈ సినిమాను ఫిబ్రవరి 21న రిలీజ్ లాక్ చేశారు. మరి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలు గెలుస్తుందా లేదా అన్నది చూడాలి. బాపు సినిమా ఒక ఎమోషనల్ రైడ్ గా డార్క్ హ్యూమర్ తో వస్తుంది. సినిమాలో చాలా సీన్స్ కి ఆడియన్స్ హృదయాలు బరువెక్కుతాయని చిత్రయూనిట్ చెబుతున్నారు. బాపు సినిమాకు ఆర్.ఆర్ ధ్రువన్ మ్యూజిక్ అందిస్తుండగా వాసు పెందెం సినిమాటోగ్రఫీ చేశారు.

Full View
Tags:    

Similar News