1950లో మొట్ట‌మొద‌టి బోల్డ్ ఫోటోషూట్‌?

ఈ అంద‌గ‌త్తె పేరు బేగం ప‌రా. బాలీవుడ్ లో న‌టించిన పాకిస్తానీ బ్యూటీ. 1950లలో బేగం పారా పాపుల‌ర్ బాలీవుడ్ నటి

Update: 2024-04-01 15:31 GMT

భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టి బోల్డ్ ఫోటోషూట్‌లో పాల్గొన్న క‌థానాయిక ఎవ‌రు? రొటీన్ కి భిన్నంగా అత్యంత శృంగార ర‌స పాత్ర‌ల‌తో మెప్పించిన క్లాసిక‌ల్ డే న‌టి ఎవ‌రు? అంటే దానికి స‌మాధానం ఇక్క‌డ ఉంది.

ఈ అంద‌గ‌త్తె పేరు బేగం ప‌రా. బాలీవుడ్ లో న‌టించిన పాకిస్తానీ బ్యూటీ. 1950లలో బేగం పారా పాపుల‌ర్ బాలీవుడ్ నటి. ఆమె అసాధారణమైన అందం.. డేరింగ్ స్టైల్ యువ‌త‌రాన్ని పిచ్చెక్కించేవి. నీల్ కమల్, జర్నా, కర్ భలా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలలో అద్భుత‌ నటనతో సినీవినీలాకాశంలో ఓ వెలుగు వెలిగింది. పారా నమ్మశక్యం కాని ఫ్యాషన్ సెన్స్ త‌న‌కు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. నాటి రోజుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న మేటి న‌టి బేగం పారా.

1950లలో నటీమణులు చాలా అరుదుగా బోల్డ్ ఫోటోషూట్‌లు లేదా హాట్ సీన్‌లు చేసేవారు. కానీ లైఫ్ మ్యాగజైన్ కోసం బేగం పారా బోల్డ్ ఫోటోషూట్ కోసం అన్ని నిబంధనలను ధిక్కరించింది. చాలా మంది సాంప్రదాయిక భారతీయుల ఆలోచనను మార్చింది.

పాకిస్తాన్‌లోని 'జీలమ్‌'లో జుబైదా ఉల్ హక్‌గా జన్మించిన బేగం పారాకు ఒక సోదరుడు ఉన్నాడు. అత‌డు 1930లలో నటుడు. అతడు బొంబాయికి వ‌చ్చి బెంగాలీ నటి ప్రోతిమా దాస్‌గుప్తాను వివాహం చేసుకున్నప్పుడు, బేగం పారా ముంబై నగరం ఆకర్షణకు కదిలిపోయింది. ఆమె తరచూ సినిమా షూట్‌లు జ‌రిగే చోటికి తన కోడలు, నటి ప్రొతిమాతో కలిసి వెళ్లేది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. శషధర్ ముఖర్జీ - దేవికా రాణి ఆమెకు పార్టీలో ఒక పాత్రను ఆఫ‌ర్ చేయ‌డంతో పారా సినీ ప్రయాణం అనుకోకుండా ప్రారంభమైంది.

బేగం పారా 1944 లో 'చాంద్‌' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా హిట్‌ కావడంతో ఆమెకు పేరు వ‌చ్చింది. పారా ప్రారంభ జీతం నెలకు రూ. 1500. కానీ చివరికి 1950లలో అత్యధికంగా సంపాదిస్తున్న నటీమణులలో ఒకరిగా ఎదిగారు. 2008లో సంజయ్ లీలా భ‌న్సాలీ చిత్రం 'సావరియా'లో ఆమె సోనమ్ కపూర్ అమ్మమ్మగా నటించింది.

తన తొలి చిత్రం 'చాంద్‌'లో, బేగం పారా త‌న‌ సహనటుడు ప్రేమ్ అదీబ్‌తో ల‌వ్ మేకింగ్ సన్నివేశాల్లో జీవించింది. ఈ దృశ్యాలు ఆధునిక సినిమాలకు భిన్నంగా ఉన్నాయి. ఇందులో చేతులు పట్టుకోవడం, సెరెనేడింగ్ .. కంటిచూపుతో ఆక‌ర్షించ‌డం వంటివి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. న‌ట‌న హావ‌భావాల్లో సరళత ఉన్నా కానీ శృంగార వర్ణన ఆ కాలంలో ఆశ్చర్యకరంగానే భావించారు. ఇప్పుడంటే హీరోయిన్లు సిగ‌రెట్ వెలిగించ‌డం మందు తాగ‌డం వంటివి రొటీన్ కానీ, అప్ప‌ట్లో అవి పూర్తిగా కొత్త‌వే. ప్ర‌జ‌ల్లో కొన్నేళ్ల పాటు ఈ బోల్డ్ సీన్ల గురించి చ‌ర్చ న‌డిచేది. తాజాగా బేగం పారా బోల్డ్ ఫోటోషూట్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

సినీ పరిశ్రమలో స్థిరపడిన తర్వాత, బేగం పారా నటుడు దిలీప్ కుమార్ తమ్ముడు నాసిర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు అయూబ్ ఖాన్.. సినిమాలు టెలివిజన్ రెండింటిలోనూ అత‌డు ప్రముఖ నటుడు. 1958లో వివాహం తర్వాత బేగం పారా నటనను విడిచిపెట్టింది. అయితే ఆమె బోల్డ్ స్టైల్ కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు గుర్తుండిపోయింది.

బేగం పారా 2008లో 82 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె భర్త 1974లో మరణించారు. భర్త మరణానంతరం బేగం పారా కొంతకాలం పాటు తన కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌లో రెండేళ్ళపాటు నివసించారు.

Tags:    

Similar News