జాన్వీ-శిఖ‌ర్ మ‌ధ్య‌ గుట్టు ర‌ట్టు చేసాడే!

ఆ టాపిక్ కూడా ఇంత‌వ‌ర‌కూ వాళ్లిద్ద‌రి దృష్టికి అంత సీరియ‌స్ గానూ వెళ్లిన‌ట్లు లేదు.

Update: 2024-01-01 10:28 GMT

జాన్వీక‌పూర్ -శిఖ‌ర్ ప‌హారియా కొంత కాలంగా సీరియ‌స్ గా ల‌వ్ లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టు జంట‌గా చిక్కిన సంద‌ర్భాలెన్నో. క‌లిసి ప‌బ్ ల‌కు వెళ్ల‌డం ద‌గ్గ‌ర నుంచి గుళ్లు గోపురాలు చుట్టేయ‌డం వ‌ర‌కూ ఈ జోడీ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతుంది. కానీ ఇంత‌వ‌ర‌కూ ఈ వ్య‌వ‌హారమంతా ఎక్క‌డా అధికారికం కాలేదు. జాన్వీ గానీ..శిఖ‌ర్ గానీ ఎక్క‌డా స్పందించలేదు.

ఆ టాపిక్ కూడా ఇంత‌వ‌ర‌కూ వాళ్లిద్ద‌రి దృష్టికి అంత సీరియ‌స్ గానూ వెళ్లిన‌ట్లు లేదు. స‌హ‌జంగా బాలీవుడ్ లో ఇలాంటి ఎఫైర్ ప్ర‌చారం మొద‌లైతే పీక్స్ లో ఉంటుంది. కానీ జాన్వీ-శిఖ‌ర్ వ్య‌వ‌హారంలో మాత్రం కాస్త స్లోగానే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా క‌ర‌ణ్ జోహార్ ఆ గ‌ట్టుని ర‌ట్టు చేసే ప్ర‌య‌త్నం చేసాడు. కరణ్ జోహార్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో జాన్వీక‌పూర్ తన సోదరి కుషీ క‌పూర్ తో కలిసి హాజ‌రైంది. తాజాగా ఆ ఎపిసోడ్ ప్రోమో వైర‌ల్ అవుతుంది.

జాన్వీ ఫోన్ లో శిఖ‌ర్ ప‌హారియా నెంబ‌ర్ త‌న స్పీడ్ డ‌య‌ల్ లిస్ట్ లో ఉన్న‌ట్లు అమ్మడు ధృవీక‌రించింది. కరణ్ జోహార్ తన స్పీడ్ డయల్ లిస్ట్‌లో ఉన్న ముగ్గురు పేర్లు సూచించ‌గా.. జాన్వీ కుషీ మరియు షికు అని సమాధానం ఇచ్చింది. దీంతో చెల్లెలు ఖుషీ క‌పూర్ త‌ర్వాత అత్యంత ఇష్టంగా ఇష్ట‌ప‌డేది శిఖ‌ర్ నే నా? అంటూ నెట్టింట ప్ర‌చారం ఊపందుకుంది. ఇక ఇదే వేదిక‌పై క‌ర‌ణ్ ఖుషీ క‌పూర్ ని కూడా వ‌దిలిపెట్ట‌లేదు.

అమ్మ‌డు ఇండ‌స్ట్రీకి రాక‌ముందే? నీ క‌థ ఏంటో తేలాలంటూ కూర్చున్నాడు. ఖుషీ కపూర్‌ని వేదాంగ్ రైనాతో డేటింగ్ గురించి ప్రశ్నించగా? ఖుషీ అత‌డు కేవ‌లం త‌న‌కు స్నేహితుడు మాత్ర‌మేన‌ని బ‌ధులిచ్చింది. దీంతో వాళ్లిద్ద‌రి రిలేష‌న్ షిప్ గురించి ఓ క్లారిటీ వ‌చ్చింది. ది అర్చీస్ తో ఖుషీ క‌పూర్ లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇదే ఏడాది క‌ర‌ణ్ జోహర్ బ్యాన‌ర్ లోనే ఖుషీ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.

Tags:    

Similar News