బాలయ్య మూవీ సైమా ఘనత

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

Update: 2024-09-15 11:09 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం తన 109వ చిత్రంతో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న NBK 109 ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్సెస్.. వేరే లెవెల్ లో రెస్పాన్స్ అందుకున్నాయి.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 109తో బాలయ్య మరో సూపర్ హిట్ ను అందుకుంటారని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. షూటింగ్ కూడా పూర్తవ్వలేదు. కాబట్టి.. దసరాకు కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే గత ఏడాది దసరాకు బాలయ్య భగవంత్ కేసరి మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. యూనిక్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఆ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. వయసుకు తగ్గ పాత్రలో బాలయ్య అలరించగా.. ఆయన కూతురుగా నటించిన శ్రీలీల మంచి మార్కులు కొట్టేసింది. మూవీలో శ్రీలీల, బాలయ్య మధ్య ఎమోషనల్ బాండింగ్ అందరినీ ఆకట్టుకుంది.

ఇప్పుడు భగవంత్ కేసరి.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ(SIIMA) అవార్డును గెలుచుకుంది. 2023 సంవత్సరానికి గాను బెస్ట్ మూవీగా నిలిచింది. దుబాయ్ లో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా ప్రొడ్యూసర్ సాహు గారపాటి అవార్డును అందుకున్నారు. భగవంత్ కేసరి చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ గా నిర్మించారు. హై క్వాలిటీతో సినిమాను రూపొందించారు.

అనిల్ రావిపూడి మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో బాలయ్యను చూపించి మెప్పించారు. ప్రతి ఫ్రేమ్‌ నూ నిర్మాతలు బాగా నిర్మించారు. బాలయ్య, శ్రీలీల కూడా యాక్టింగ్ తో అలరించారు. యూనిక్ అండ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో రూపొంది మంచి హిట్ అయిన ఆ మూవీ.. సైమా బెస్ట్ సినిమా అవార్డుకు పక్కా ఎలిజిబుల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ మూవీ.. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా లవర్స్ కు అందుబాటులో ఉంది.

Tags:    

Similar News